BSNL Vs Jio : ప్రైవేటు టెలికాం సంస్థలైన వొడాఫోయన్ ఐడియా, ఎయిర్‌టెల్, జియోలు ఈమధ్యే తమ మొబైల్ చార్జిల ధరలను పెంచడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు పెద్ద ఎత్తున BSNLకు మారిపోతున్నారు. తమ మొబైల్ నంబర్లను ఎంఎన్‌పీ ద్వారా BSNLకు మారుస్తున్నారు. BSNLలో త్వరలో 4జి రానుండడంతో BSNLపై వినియోగదారుల ఆసక్తి పెరిగింది. పైగా ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే BSNLలో చాలా తక్కువ ధరలకే మొబైల్ ప్లాన్లను అందిస్తున్నారు.
ఇక ఏడాది వాలిడిటీ ఉండే ఒక ప్లాన్ వాస్తవానికి జియోలో కన్నా BSNLలోనే తక్కువ ధరను కలిగి ఉంది. BSNLలో రూ.1499 చెల్లిస్తే లాంగ్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను పొందవచ్చు.ఈ ప్లాన్ వాలిడిటీ 336 రోజులు.. అంటే దాదాపుగా ఏడాదిగా ఉంది. ఇందులో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్‌లో ఉచిత రోమింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్ లో మొత్తంగా వినియోగదారులకు 24జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. రోజుకు 100 ఉచిత SMS లు లభిస్తాయి.
BSNL అందిస్తున్న రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా పైన చెప్పిన ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. ఇక ఎలాంటి బెనిఫిట్స్ మాత్రం ఉండవు. కానీ ఇంటర్నెట్ వినియోగం తక్కువగా ఉండే వారు, కాల్స్ ఎక్కువగా మాట్లాడేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఇదే ప్లాన్ జియోలో మాత్రం కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంది.
జియోలో ఏడాది వాలిడిటీ లభించాలంటే కనీసం రూ.1899 చెల్లించాలి. ఇది BSNL కన్నా రూ.400 ఎక్కువ కావడం గమనార్హం. అయితే జియో అందిస్తున్న ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు మొత్తంగా 24 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 3600 SMS లు లభిస్తాయి. దీంతోపాటు ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్‌లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ధర ప్రకారం చూస్తే BSNL లోనే ఏడాది వాలిడిటీ ప్లాన్ తక్కువ ధరను కలిగి ఉందని చెప్పవచ్చు. కనుక తక్కువ ధర కావాలనుకునే వారు BSNL లోకి మారి ఈ ప్లాన్‌ను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…