Money : ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ బాగుండాలని, ఎవరికి ఏ కష్టం రాకుండా ఉండాలని కోరుకుంటారు. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము. ఒకవేళ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే మనం శారీరక సమస్యలతో పాటు మానసిక ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితులల్లో ఇంట్లో సానుకూలత తీసుకురావడానికి మనం కొన్ని చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు నెలకొంటుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
ఇంట్లో సానుకూలత రావాలంటే మనం చేయాల్సిన పనులు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో సానుకూలత రావాలన్నా మనపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలన్నా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఇంటికి ఉండే ప్రధాన తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మురికి చెప్పులు, బూట్లు ఉండకూడదు. అలాగే ఇంట్లో సానుకూలత పెరగాలంటే నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. దీపాన్ని వెలిగించడానికి ఆవాల నూనెను ఉపయోగిస్తే మరింత మేలు కలుగుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులను కట్టడం మంచిది.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూలత తొలిగిపోతుంది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరగకుండా ఉంటాయి. అదే విధంగా రోజూ ఉదయం మరియు సాయంత్రం తులసిని పూజించాలి. ఇంట్లో సానుకూలత పెరగాలంటే రోజూ తులసి మొక్కకు ఉదయం నీరు పోసి సాయంత్రం దీపం వెలిగించాలి. అలాగే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తరువాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. ఇలా చేయడం వల్ల మీ స్థానం మరియు గౌరవం పెరుగుతుంది. ఈ విధంగా ఈ పనులను చేయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరగడంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…