Mango Ice Cream : వేసవికాలంలో మనకు బయట ఎక్కువగా లభించే వాటిల్లో ఐస్ క్రీమ్స్ కూడా ఒకటి. ఐస్ క్రీమ్స్ ను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మనకు వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్స్ లభిస్తూ ఉంటాయి. వాటిలో మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అయితే బయట కొనే పని లేకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి ఫ్రిజర్వేటివ్స్ లేకుండా చాలా సులభంగా దీనిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కేవలం మూడంటే మూడు పదార్థాలను ఉపయోగించి ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా ఇంట్లోనే రుచిగా మ్యాంగో ఐస్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఫ్రెష్ క్రీమ్ – 250 ఎమ్ ఎల్, పంచదార పొడి – 4 లేదా 5 టీ స్పూన్స్, తరిగిన మామిడిపండు – 1, ఫుడ్ కలర్ – చిటికెడు.
మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ విధానం..
ముందుగా ఫ్రెష్ క్రీమ్ ను అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచి బయటకు తీయాలి. మామిడిపండును ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో ప్రెష్ క్రీమ్, పంచదార పొడి, మామిడిపండు ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ కలర్ ఫుల్ గా ఉండాలనుకునే వారు ఫుడ్ కలర్ ను వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాక్స్ లోకి తీసుకుని మూత పెట్టి 4 నుండి 5 గంటల పాటు డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత ఐస్ క్రీమ్ ను బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోనే చాలా సులభంగా మ్యాంగో ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…