Marriage Muhurthams 2024 : కూతురు లేదా కొడుక్కి వివాహం చేసేటప్పుడు తల్లిద్రండులు అనేక విషయాలను మదిలో ఉంచుకుని వివాహం జరిపిస్తూ ఉంటారు. వాటిలో అనేక విషయాలు ఉంటాయి. వివాహం కుదిరింది అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ముహుర్తం. శుభ ముహుర్తాన, శుభ గడియల్లోనే వివాహం జరగాలని కోరుకుంటారు. మంచి ముహుర్తంలో వివాహం జరిపించడం వల్ల ఆ జంట కలకాలం ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉంటారని భావిస్తారు. అయితే ఈ ఏడాది శుభ ముహుర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి.
శుభ ముహుర్తాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఏడాది వివాహం చేసుకోవాలనుకునే వారు ముందుగానే జాగ్రత్త పడడం చాలా అవసరం. ప్రస్తుతం శుభ కార్యాలు జరగని ఖర్మలు నడుస్తున్నాయి. ఏప్రిల్ 14 వ తేదీ రాత్రి తరువాతే ఈ ఖర్మలు ముగియనున్నాయి. ఆ తరువాతే మంచి గడియలు రానున్నాయి. ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు గరిష్టంగా 14 శుభ ముహుర్తాలు ఉన్నాయి. పంచాగం ప్రకారం ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ఉన్న శుభ ముహుర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చైత్ర శుక్ల దశమి గురువారం ఏప్రిల్ 18
2. చైత్ర శుక్ల త్రయోదశి ఆదివారం ఏప్రిల్ 21
3. చైత్ర శుక్ల చతుర్దశి సోమవారం ఏప్రిల్ 22
4. చైత్ర శుక్ల పూర్ణిమ మంగళవారం ఏప్రిల్ 23
5. చైత్ర శుక్ల పాడ్యమి బుధవారం ఏప్రిల్ 24
6. ఆషాడ శుక్ల తృతీయ మంగళవారం జూలై 09
7. ఆషాడ శుక్ల పంచమి గురువారం జూలై 11
8. ఆషాడ శుక్ల నవమి సోమవారంజూలై 15
9. మార్గశిర కృష్ణ తృతీయ సోమవారం నవంబర్ 18
10. మార్గశిర కృష్ణ సప్తమి శుక్రవారం నవంబర్ 22
11. మార్గశిర శుక్ల పాడ్యమి సోమవారం డిసెంబర్ 02
12.మార్గశిర శుక్ల ద్వితీయ మంగళవారం డిసెంబర్ 03
13. మార్గశిర శుక్ల తృతీయ బుధవారం డిసెంబర్ 04
14.మార్గశిర శుక్ల చతుర్దశి శనివారం డిసెంబర్ 14
ఈ విధంగా ఈ సంవత్సరం చాలా తక్కువ శుభ ముహుర్తాలు ఉన్నాయి. ఇవి కాక ఏప్రిల్ 19, జూలై 10, 12,13, 14, 16, నవంబర్ 16, 17, 24, 25, 26, 28 మరియు డిసెంబర్ 5, 9,10, 11 తేదీల్లో కూడా ముహుర్తాలు ఉన్నాయి. అవసరమైన వారు జోతిష్యున్ని సంప్రదించి ఈ ముహుర్తాలలో కూడా శుభ కార్యాలు చేసుకోవచ్చు.