Lord Shani : నవగ్రహాల్లో శని కూడా ఒకరు. ఈయనను కర్మ ప్రదాత అని, న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు. మనం చేసే మంచి, చెడు కర్మలకు అనుగుణంగా శని మనల్ని శిక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మొత్తం 9 గ్రహాల్లో శనీశ్వరుడికే అత్యంత ఎక్కువ ఆగ్రహం ఉంటుందట. అలాగే ఈయన చాలా శక్తివంతమైన గ్రహం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శనీశ్వరుడు తన సొంత రాశిలోనే తిరోగమనంలో ఉన్నాడట. దీంతో ఆయన వ్యతిరేక దిశలో సంచరించినప్పుడు ఆయన ప్రభావం కొందరిపై గణనీయంగా పడుతుందని పండితులు చెబుతున్నారు. దీన్ని శని తిరోగమనం అని కూడా అంటారట.
ఇలా శనీశ్వరుడు 92 రోజుల పాటు తిరోగమంలో ఉంటాడట. తరువాత నవంబర్ 15 నుంచి కుంభరాశి వైపు కదులుతాడట. శనీశ్వరుడి తిరోగమన సమయంలో ఆయనకు నచ్చని పనులను చేయకూడదని పండితులు చెబుతున్నారు. శనీశ్వరుడు వ్యతిరేక దిశలో ప్రయాణించే సమయంలో ఆయన ప్రభావం కొన్ని రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది. మీన, కుంభ, మకర రాశులకు చెందిన వారికి ఈ సమయంలో ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అలాగే వృశ్చికం, కర్కాటక రాశుల వారిపై కూడా శనిదోష ప్రభావం పడుతుంది. అలాంటి స్థితిలో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయట. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఇక శని తిరోగమన దిశలో ఉన్నప్పుడు ఆయా రాశుల వారు ఎలాంటి పనులను ప్రారంభించకూడదు. ముఖ్యంగా కొత్త పనులు చేయకూడదు. అలాగే శుభ కార్యాలను కూడా నిర్వహించకూడదు. శనీశ్వరున్ని న్యాయం చేసే దేవుడిగా విశ్వసిస్తారు. అందువల్ల ఆయన తిరోగమన దిశలో ఉన్నప్పుడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు కొన్ని పనులను అసలు చేయకూడదు. అలా చేస్తే శనీశ్వరుడికి ఆగ్రహం వస్తుంది. దీంతో ఆయన సమస్యలను కలగజేస్తాడు.
శని తిరోగమన దిశలో ఉన్న సమయంలో ఆయా రాశుల వారు అత్యాశ, అసూయ కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిది. వృద్ధులను ఎట్టి పరిస్థితిలోనూ అవమానించకూడదు. పేదలను, నిస్సహాయులను ఎగతాళి చేయకూడదు. శరీరంపై నియంత్రణను కలిగి ఉండాలి. ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చకూడదు. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. అసభ్యకరమైన లేదా చెడు మాటలను మాట్లాడకూడదు. జంతువులు, పక్షులను హింసించకూడదు. రుషులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను పూజించాలి.
శని తిరోగమన దిశలో ఉన్నప్పుడు పవిత్రమైన నదుల్లో స్నానం చేస్తే ఆయన ప్రభావం పడకుండా ఉంటుంది. అలాగే ఒక ఇనుప గిన్నెలో ఆవాల నూనె నింపిన తరువాత అందులో మీ ముఖాన్ని చూసుకోవాలి. అనంతరం ఆ గిన్నెతోపాటు ఆ నూనెను దానం చేయాలి. ఈ సమయంలో మీరు సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా చదివితే మంచిది. శనీశ్వరుడి తిరోగమన సమయంలో ఇనుము, మినుములు, ఆవాల నూనె, నల్ల నువ్వులు, నల్ల దుస్తులు, దుప్పట్లు దానం చేస్తే మంచిది. దీంతో శని సంతోషిస్తాడు. మీపై ఎలాంటి ప్రభావం చూపించడు. మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కనుక ఈ సమయంలో ఆయా రాశుల వారు శని విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…