Wallet : మనం అనేక రకాల వస్తువులను ధరిస్తుంటాం. పురుషులు అయితే పర్సులను ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటారు. స్త్రీలు అయితే హ్యాండ్ బ్యాగ్‌ను చేతిలో పట్టుకుంటారు. అయితే ఎవరు ఏది వాడినా సరే వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పర్సులను పెట్టుకోవడంలో ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించాలట. ఇలా చేస్తే మీకు ఉండే ఇబ్బందులు పోయి డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయని, ఆర్థిక సమస్యలు పోతాయని, అన్నింటా విజయం సాధిస్తారని చెబుతున్నారు. ఇక ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది పర్సులను కొనేటప్పుడు చాలా చీప్ క్వాలిటీ ఉన్నవి కొంటారు. ఇలాంటి వాటి వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన పర్సులనే కొనాలి. ఇవి అయితేనే ఎక్కువ రోజుల పాటు మన్నుతాయి. అలాగే ఎక్కువ రోజుల పాటు మీ దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తాయి. అలాగే కొందరు పర్సులో డబ్బు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, కాయిన్స్ వంటి వాటిని అడ్డ దిడ్డంగా పెడతారు. అలా చేయకూడదు. చేస్తే దోషం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. పర్సులో డబ్బు, కార్డులు వంటి ఐటమ్స్‌ను ఒక పద్ధతిగా పెట్టుకోవాలి.
పర్సు రంగు కూడా వాస్తు ప్రకారం ముఖ్యమైనదే. ఏ రంగు పడితే ఆ రంగు పర్సును వాడకూడదు. దీని వల్ల దోషం ఏర్పడుతుంది. మీ రాశి ప్రకారం మీకు ఏ రంగు అయితే సరిపోతుందో ఆ రంగుకు చెందిన పర్సునే వాడాలి. అంతేకానీ ఏ రంగు పర్సును పడితే ఆ రంగు పర్సును వాడకూడదు. పర్సులో కొందరు మితిమీరిన నగదును పెట్టుకుంటారు. అలా చేయకూడదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ ఎంత నగదు అవసరం అవుతుందో అంతే లెక్కించి పర్సులో పెట్టుకోవాలి. ఎక్కువగా డబ్బును పర్సులో పెట్టకూడదు.
పర్సును తీసేశాక కొందరు దాన్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అలా చేయకూడదు. ఇంట్లో బీరువాలో లాకర్‌లో లేదా మీరు డబ్బు దాచే చోట పర్సును పెట్టాలి. అలాగే పర్సుపై కొందరు ఏ సింబల్స్‌ను పడితే ఆ సింబల్స్‌ను వేయిస్తుంటారు. అలా చేయకూడదు. ఓం లేదా స్వస్తిక్, గణేష్, హనుమాన్, లక్ష్మీదేవి వంటి బొమ్మలను వేయించుకుంటే మంచిది. అలాగే పర్సును ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. అందులో చెత్త పెట్టకూడదు.
పర్సు ఒకవేళ చిరిగిపోతే దాన్ని అలాగే వాడకూడదు. కొత్త పర్సును వాడాలి. పాత పర్సును పడేయాలి. పర్సులో వీలున్నంత వరకు కరెన్సీ నోట్లు, నాణేలు, డెబిట్, క్రెడిట్ కార్డులనే పెట్టాలి. ఇతర వస్తువులను పెట్టకూడదు. లేదంటే దోషం ఏర్పడి ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇలా పర్సులను వాడే విషయంలో పురుషులు అయినా, స్త్రీలు అయినా ఒకేలాంటి నియమాలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…