Lines In Palm : ఎప్పుడైనా సరే, పండితులు మన భవిష్యత్తు ఎలా ఉందనేది చెప్పాలంటే, చెయ్యిని చూసి చెప్తారు. మన చేతి మీద ఉండే రేఖలు ఆధారంగా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వంటివి చెబుతూ ఉంటారు. హస్త సాముద్రికం ప్రకారం, మన చేతి రేఖలులో, మన అదృష్టానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉంటాయట. ప్రతి ఒక్కరూ, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉంటారు. అలానే, కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అనే విషయాలని కూడా తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు.
అలాంటప్పుడు, చేతి పై ఉన్న రేఖల ద్వారా చెప్పచట. ఒక వ్యక్తి ఎంత అదృష్టవంతుడు అనేది అరచేతిని చూసి చెప్పొచ్చు. మణికట్టు దగ్గర మొదలై మధ్య వేలు వరకు, వెళ్లే రేఖని విధిరేఖ అని అంటారు. హస్త సాముద్రికం ప్రకారం, ఎవరి అరిచేతులో, ఈ రేఖ శుభ్రంగా నిటారుగా ఉంటుందో, అటువంటి వాళ్లు జీవితంలో గొప్ప పురోగతిని సాధిస్తారు. అలానే, అటువంటి వ్యక్తులు దృష్టి పూర్తిగా లక్ష్యం పైనే పెడతారు. ఆర్థికంగా బలంగా ఉంటారు.

డబ్బుకి అసలు లోటే ఉండదు. అరచేయి మృదువుగా ఉండి, అరచెయ్యి గులాబీ రంగులో ఉంటే కూడా, చాలా అదృష్టవంతుడట. హస్త సాముద్రికం ప్రకారం, అలాంటి వాళ్ళల్లో రాజయోగం ఉంటుందట. వారు ఎల్లప్పుడూ రాజుల వలె జీవితాన్ని గడుపుతారు. మర్యాదగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది.
గోళ్ళపై చంద్రుడిలా తెల్లటి గుర్తు ఉంటే, దాన్ని శుభప్రదంగా భావించాలి. వాళ్ళు జీవితంలో పురోగతిని సాధిస్తారు. ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. కెరియర్ లో కూడా అనుకున్న ఫలితాలు ఎదురవుతాయి. అదేవిధంగా, ఎవరైనా వ్యక్తికి మృదువైన గులాబీ గోళ్లు ఉంటే, వాళ్లు కూడా చాలా అదృష్టవంతులు. వాళ్ళ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. అలానే, అన్ని సౌకర్యాలతో వాళ్ళు ఉంటారు. అలాంటి వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.