Children In Sleep : చిన్నారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ వివిధ రకాల పద్ధతుల్లో దిష్టి తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టితీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తూంటారు. బయట జనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే చిన్న పిల్లవాడు నిద్రలో కలవరింతలకు గురికావడం, నిద్ర నుంచి పదే పదే ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవ లక్షణాలు లేకుండా ఉంటాడని నమ్ముతారు.
చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కొంత అస్వస్థతకు గురి అవుతారు. అందుకే వివాహ వేడుకలలో, పుట్టిన రోజువేడుకలలో విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటంవల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతోపాటు ధైర్య గుణంవస్తుంది. కొందరి చూపులు మంచివి కావనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ చెడు చూపు నుంచి దిష్టి రక్షణ ఇస్తుందని విశ్వసిస్తారు. అలాగే కళ్లుప్పును శరీరం చుట్టూ తిప్పి వాటిని మంటల్లో వేయడం కూడా దిష్టి తీయడంలో ఉంది.
సాధారణంగా ఎవరికైనా సరే దిష్టి తగిలితే ఉన్నట్లుండి అస్వస్థతకు లోనవుతారు. వికారంగా, వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇలా జరిగితే వెంటనే దిష్టి తీయాలి. అలాగే చిన్నారులు రాత్రి పూట నిద్రలో ఉలిక్కిపడడం, భయపడడం, నిద్రలో కలవరిస్తూ ఏడవడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ దిష్టి లక్షణాలే. కనుక దిష్టి తీస్తే ఇలా వారు ప్రవర్తించకుండా ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక చిన్నారులకు దిష్టి అనేది తప్పనిసరి. తప్పకుండా రోజూ దిష్టి తీయాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…