ఇంటి లోపలి గదులను అందంగా అలంకరించుకునేందుకు చాలా మంది రకరకాల అలంకరణలను ఉపయోగిస్తుంటారు. హాల్, బెడ్‌రూమ్‌లు, కిచెన్.. ఇలా భిన్న రకాల గదులను భిన్నంగా అలంకరించుకుంటుంటారు. అయితే ఇంట్లో అక్వేరియంలను పెట్టుకోవచ్చా ? లేదా ? పెట్టుకుంటే ఏమైనా దోషాలు వస్తాయా ? అశుభం కలుగుతుందా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఇందుకు వాస్తు శాస్త్ర నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో అక్వేరియంలను పెట్టుకోవడం మంచిదే. దాంతో ఎలాంటి అశుభం కలగదు. అక్వేరియంలో చేపలు తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇందులో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. చేపలు ఆరోగ్యానికి సూచికలు. అందువల్ల ఇంట్లో అక్వేరియంను పెట్టుకుంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ ప్రభావం పోతుంది.
ఇంట్లో అక్వేరియంను పెట్టుకోవడం వల్ల అదృష్టం కలసి వస్తుంది. సంతోషంగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
అయితే అక్వేరియంను పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలే కలిగినప్పటికీ అక్వేరియంను పెట్టుకోవడంలోనూ నియమాలు ఉంటాయి. వాటిని పాటిస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి.
అక్వేరియంలో ఎల్లప్పుడూ నీరు తాజాగా ఉండేలా చూసుకోవాలి. అక్వేరియం దుమ్ము పట్టి ఉండరాదు. చేపలు చనిపోతే వెంటనే తీసేయాలి. ఈ విధంగా అక్వేరియంను పెట్టుకుంటే మంచి జరుగుతుంది.
ఇక అక్వేరియంలో గోల్డెన్, డ్రాగన్ చేపలను పెంచితే వాస్తు ప్రకారం ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అక్వేరియంలో 9 చేపలను పెంచుకోవాలి. వాటిల్లో 8 చేపలు ఒకే రకానికి చెందినవి ఉండేలా చూసుకోవాలి.
అక్వేరియంను ఎల్లప్పుడూ హాల్ లేదా స్టడీ లేదా లివింగ్ రూమ్‌లోనే పెట్టాలి. బెడ్‌రూమ్, కిచెన్‌లలో ఉంచరాదు. ఈ విధంగా నియమాలను పాటిస్తే అక్వేరియంను పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…