ఆధార్ కార్డును తీసుకున్న తరువాత కూడా అందులో ఏవైనా మార్పులు ఉంటే సులభంగానే చేసుకోవచ్చు. కొన్ని రకాల మార్పులను ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కొన్నింటికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆధార్ కార్డులో ఉన్న ఫొటో నచ్చకపోతే దాన్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డులో ఉన్న ఫొటోను మార్చుకునేందుకు అనుసరించాల్సిన స్టెప్స్
స్టెప్ 1 : UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ నుంచి ముందుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 2 : ఫామ్ లో అన్ని వివరాలను నమోదు చేసిన తరువాత ఆధార్ కేంద్రంలో ఎన్‌రోల్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌కు ఫామ్‌ను అందజేయాలి.
స్టెప్ 3 : ఫామ్‌లో మీరు ఇచ్చిన వివరాలను ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ వివరాలతో సరిపోల్చి చెక్ చేసుకుంటారు.
స్టెప్ 4 : ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని కొత్తగా ఫోటో తీస్తారు.
స్టెప్ 5 : ఇందుకు గాను రూ.25 + జీఎస్‌టీ కలిపి చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది.
స్టెప్ 6 : ఫొటో తీసిన అనంతరం ఎగ్జిక్యూటివ్ URN తో కూడిన అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను అందిస్తారు.
స్టెప్ 7 : URN ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఆధార్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఆధార్ కార్డులో ఫొటో అప్‌డేట్ అయ్యాక కొత్త ఆధార్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా ఫిజికల్ పీవీసీ కార్డును పైన తెలిపిన UIDAI వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయవచ్చు. దీంతో ఆధార్ పీవీసీ కార్డు పోస్టు ద్వారా ఇంటికి వస్తుంది. ఈ విధంగా ఆధార్‌లో ఫొటోను మార్చుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…