Blue Color Wall : మనం సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటూ ఉంటాము. చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. వాస్తు శాస్త్రానికి విరుద్దంగా పనులు చేయడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు చోటు చేసుకుంటాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఇంటి నిర్మాణ విషయంలోనే కాకుండా ఇంటికి వేసే రంగుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రంలో ఇంటికి వేసే రంగుల గురించి కూడా ప్రస్తావించబడిందని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నీలి రంగును వేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో నీలి రంగు వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు నివాసం ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
నీరు, నీలి రంగు వంటివి శాంతికి చిహ్నంగా భావించినప్పటికి ఇంట్లో కొన్ని దిశల్లో నీలిరంగు వేయడం మంచిది కాదు. వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశలో నీలిరంగు వేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో దక్షిణ దిశలో నీలి రంగు వేయకూడదు. దక్షిణ దిశ అగ్ని దిశ. ఈ దిశలో నీల రంగు వేయడం వల్ల ఇంట్లో గొడవలు, సమస్యలు రావడంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలాగే తూర్పు దిశలో కూడా నీలిరంగు వేయకూడదు. తూర్పు సూర్యుని దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశలో కూడా నీలిరంగు వాడడం అంత మంచిదని కాదని పండితులు చెబుతున్నారు.అలాగే వంటగదిలో కూడా నీలిరంగును ఉయోగించకూడదు. శివుని గొంతులో నీలిరంగులో విషం ఉంటుంది. కనుక వంటగదిలో కూడా నీలి రంగు వేయకూడదు.
అలాగే డబ్బు నిల్వ చేసే చోట కూడా నీలిరంగు వేయకూడదు. నీరు నీలి రంగులో మాదిరి ఉంటుంది. డబ్బు నిల్వ చేసే చోట ఈ రంగు వేయడం వల్ల డబ్బు కూడా నీటి లాగా నిల్వ ఉండకుండా పోతుందని కనుక డబ్బు నిల్వ చేసే చోట కూడా నీలి రంగు వేయకూడదని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఉత్తరం వైపున నీలిరంగును, నీలి రంగు టైల్స్ ను ఉపయోగించవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.