TTE And TC : సాధారణంగా చాలా మంది దూరప్రయాణాలు చేసేవారు రైళ్లలోనే వెళ్తుంటారు. కేవలం స్థోమత ఉన్నవారు మాత్రమే విమానాల్లో ప్రయాణం చేస్తారు. గంటల తరబడి బస్సుల్లో ప్రయాణం చేయాలన్నా ఇబ్బందే. కనుక చాలా మంది రైళ్లలో వెళ్లేందుకే ఇష్టపడతారు. రైళ్లలో అయితే బస్సుల్లో కన్నా తక్కువ ఛార్జి అవుతుంది. అందుకనే ట్రెయిన్ జర్నీనే ఎక్కువ చేస్తుంటారు. అయితే రైళ్లో మీరు ప్రయాణం చేసేటప్పుడు టీసీ వస్తుంటాడు కదా. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో మనం వారి బ్యాడ్జిల మీద టీటీఈ లేదా టీసీ అని చూస్తుంటాం. ఈ రెండు పదాలు చూసేందుకు ఒకేలా ఉంటాయి. కానీ కన్‌ఫ్యూజ్ చేస్తాయి. అయితే వాస్తవానికి రెండూ ఒకేలా ఉన్నా ఈ ఇద్దరు చేసే పని వేరుగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీటీఈ అంటే ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్. అంటే ఈయన ట్రెయిన్‌లో ఎక్కి మనం ప్రయాణంలో ఉండగా మన వద్దకు వచ్చి మన దగ్గర టిక్కెట్లు ఉన్నాయా, లేదా, సరైన ట్రెయిన్‌కి సరైన రిజర్వేషన్‌తోనే టిక్కెట్ తీసుకున్నామా, మన ఐడీ కార్డు, ఇతర వివరాలను చెక్ చేస్తాడు. ఇక టీసీ అంటే ఏమిటో కూడా చూద్దాం. టీసీ అంటే టిక్కెట్ కలెక్టర్ అని అంటారు.
మనం రైళ్లలో ప్రయాణించేటప్పుడు కేవలం టీటీఈ మాత్రమే మన టిక్కెట్లను పరిశీలించాల్సి ఉంటుంది. టీసీకి ఆ అధికారం ఉండదు. రైల్వే ప్లాట్‌ఫామ్, చుట్టు పక్కల పరిసరాల్లో టీసీ మన టిక్కెట్లను పరిశీలిస్తాడు. అంతేకానీ టీసీ రైళ్లలో మన టిక్కెట్లను తనిఖీ చేయలేడు. కనుక ఇకపై ట్రెయిన్లలో మీ టిక్కెట్లను తనిఖీ చేసేవారు టీటీఈ అయి ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. టీసీలు రైళ్లలో టిక్కెట్లను చెక్ చేయలేరు. ప్లాట్‌ఫామ్‌పై, స్టేషన్ పరిసరాల్లో చెక్ చేయగలరు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…