Aratikaya Bajji : సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది ఏం స్నాక్స్ తిందామా అని ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఎవరి అభిరుచికి తగినట్లు వారు సాయంత్రం చిరుతిండిని లాగించేస్తుంటారు. అయితే బయటి తిండి ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. కనుక ఇంట్లోనే వీటిని వండుకుని తింటే బాగుంటుంది. ఈ క్రమంలోనే బయట బండ్లపై లభించే అరటికాయ బజ్జీలను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. అరటికాయ బజ్జీల తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటికాయ – 1, శనగపిండి – 1 కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, మిరపకారం – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీస్పూన్, కసూరీ మేథీ – 1 టీస్పూన్, వంట సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, వేయించిన పల్లీలు – 1 టేబుల్ స్పూన్, సన్నటి ఉల్లి తరుగు – అర కప్పు, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్.
అరటి కాయల తొక్కు తీసి సన్నగా చక్రాల్లా తరిగి ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, మిరపకారం, ఉప్పు, ధనియాల పొడి, కసూరీ మేథీ, వంట సోడా వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేస్తూ బజ్జీల పిండి మాదిరిగా కలపాలి. స్టవ్ మీద బాణలిలో నూనె కాగాక అరటికాయ చక్రాలను ఒక్కోటి పిండిలో ముంచుతూ నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. కత్తితో బజ్జీలను ఒక వైపు సన్నగా కట్ చేయాలి. మూడు పల్లీలు, ఉల్లి తరుగు స్టఫ్ చేసి పైన నిమ్మకాయ రసం పిండి సర్వ్ చేయాలి. వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ వీటిని ఇష్టంగా తింటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…