క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రస్తుతం చాలా వరకు కాంటాక్ట్‌లెస్ కార్డుల రూపంలో అందిస్తున్నారు. వాటిపై చిత్రంలో చూపిన విధంగా సింబల్ ఉంటుంది. ఈ కార్డుల వల్ల చెల్లింపులు చేసే సమయాల్లో పిన్‌ను ఎంటర్ చేయాల్సిన పనిలేదు. ఒక ట్రాన్సాక్షన్‌కు నిర్దిష్టమైన పరిమితి వరకు పిన్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. బ్యాంకులను బట్టి కార్డుకు ఒక ట్రాన్సాక్షన్‌కు నిర్దిష్టమైన పరిమితి ఉంటుంది.
కొన్ని బ్యాంకులు తాము అందించే కాంటాక్ట్ లెస్ కార్డులకు ఒక ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ.2వేల వరకు పరిమితిని విధిస్తున్నాయి. అంటే ఆ మొత్తం వరకు ట్రాన్సాక్షన్ చేసినా పిన్ లేకుండానే చెల్లింపులు జరవపచ్చన్నమాట. ఇక కొన్ని బ్యాంకులు ఆ లిమిట్‌ను రూ.4వేల వరకు అందిస్తున్నాయి. అయితే ఈ కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
కాంటాక్ట్ లెస్ కార్డులకు పిన్ అవసరం ఉండదు. కాబట్టి ట్రాన్సాక్షన్ చేసే సమయంలో కచ్చితంగా చెక్ చేయాలి. లేదంటే రెండు సార్లు కార్డును స్వైప్ చేస్తారు. అప్పుడు రెండు సార్లు డబ్బులు కట్ అవుతాయి. అలాంటి సందర్భాల్లో బిల్లు ఇచ్చేందుకు నిరాకరిస్తారు. కనుక కచ్చితంగా బిల్లు పొందాలి. మన మొబైల్‌కు వెంటనే మెసేజ్ రాదు. కొద్దిగా ఆలస్యం అవుతుంది. కనుక ఒకటి కన్నా ఎక్కువ సార్లు ట్రాన్సాక్షన్ అయిందీ, లేనిదీ మనకు తెలియదు. కాబట్టి కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా పేమెంట్లు చేసేటప్పుడు స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి. లేదంటే కొందరు ఎక్కువ సార్లు కార్డును స్వైప్ చేస్తారు. ఆ విషయాన్ని పసిగట్టకపోతే మనం డబ్బును నష్టపోవాల్సి వస్తుంది. కాంటాక్ట్ లెస్ కార్డులను వాడేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…