స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులను తమ తమ పాన్ లను ఆధార్‌లతో అనుసంధానించాలని సూచించింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే తమ శాశ్వత ఖాతా నంబర్ (పాన్) ను ఆధార్‌తో లింక్ చేయాలని, దీంతో ఇబ్బందులు లేకుండా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చని ఎస్‌బీఐ తెలియజేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి అని ఎస్‌బీఐ తెలిపింది. అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి, ఇబ్బందులు లేని బ్యాంకింగ్ సేవలను కొనసాగించడానికి వినియోగదారులు వారి పాన్‌లను ఆధార్‌లతో అనుసంధానించాలని సూచిస్తున్నాం.. అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఒకవేళ ఎస్‌బీఐ కస్టమర్లు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే వారి పాన్ పనిచేయకుండా పోతుంది. లేదా క్రియారహితంగా ఉంటుంది. ఖాతాదారుల పాన్ పనిచేయకపోతే లావాదేవీలను నిర్వహించడానికి వీలు కాదు. అందువల్ల పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించాలి. ఇందుకు చివరి తేదీని సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. కనుక బ్యాంకు సేవలకు అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఖాతాదారులు తమ పాన్‌లను ఆధార్‌లతో లింక్ చేయాల్సి ఉంటుంది.
ఖాతాదారులు www.incometax.gov.in కు వెళ్లి లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి. తరువాత వచ్చే ఆప్షన్ల ప్రకారం ఆయా వివరాలను నమోదు చేయాలి. దీంతో పాన్, ఆధార్ లింక్ అవుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…