విశాఖపట్నం జిల్లా పరిధిలోని అరకు లోయలో విషాదం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఓ మహిళతోపాటు ఆమెకు చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో నలుగురి మృతదేహాలు ఇంట్లో కనిపించాయి. దీంతో ఈ సంఘటన అనేక అనుమానాలను కలిగిస్తోంది. సదరు మహిళే తన పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుందా ? లేదా ఆమె భర్త ఈ విధంగా చేశాడా ? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
అరకులోయ పట్టణం పరిధిలోని పాత పోస్టాఫీస్ కాలనీలో ఓ మహిళ, ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ఆమె ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోయింది. కాగా ఆమె ముగ్గురు పిల్లలు ఇంకో గదిలో చనిపోయారు. అయితే వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే వారు చనిపోయారని వైద్యులు తెలిపారు.
అరకులోయ మండలం కొత్త బల్లుగూడ పంచాయతీ సిమిలిగూడ గ్రామానికి చెందిన శెట్టి సంజీవరావు జీసీసీలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. భార్య శెట్టి సురేఖ (34), కుమార్తె సుశాన్ (10), కుమారులు సర్విన్ (8), సిరిల్(4)లతో కలిసి పాత పోస్టాఫీస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఆ ఇద్దరు దంపతుల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భర్త సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే మంచంపై పడి ఉన్న తన ముగ్గురు పిల్లలను చూసి స్థానికుల సహాయంతో వెంటనే అక్కడి ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.
పిల్లలను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మరోవైపు తల్లి సురేఖ కోసం గాలించగా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించి, సురేఖ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు ఆధారాలు లభించాయని అరకు పోలీసులు తెలిపారు. వంట గదిలో సగం తిన్న భోజనం ప్లేట్లు ఉన్నాయని చెప్పారు. అయితే సంజీవరావే తమ కూతురు, మనవలను హత్య చేసి నాటకాలు ఆడుతున్నాడని సురేఖ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…