దేశంలోని పాన్ కార్డు దారులు తమ పాన్ ను ఆధార్‌తో అనుసంధానించేందుకు కేంద్రం ఇప్పటికే పలు మార్లు గడువును పెంచిన విషయం విదితమే. కరోనా నేపథ్యంలో, పలు ఇతర కారణాల వల్ల ఆ గడువును పెంచుతూ పోతున్నారు. అయితే మళ్లీ కరోనా ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో ఆ గడువును ఇంకా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్స్‌పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన ధ్రువపత్రాల గడువును కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పెంచింది. దీంతో పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును కూడా పెంచుతారని తెలుస్తోంది. అయితే గడువు పెంచినా, పెంచకపోయినా కచ్చితంగా ఎవరైనా సరే తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించాలి. లేదంటే రూ.1000 జరిమానా విధిస్తారు.
కేంద్రం ఇటీవలే ఫైనాన్స్ బిల్ 2021ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని ఇంకా అమలు చేయలేదు. కానీ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే ఈ బిల్లును అమలు చేస్తే పాన్, ఆధార్‌లను గడువులోగా అనుసంధానం చేయని వారికి రూ.1000 జరిమానా విధిస్తారు. కనుక పాన్-ఆధార్‌లను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక కింద తెలిపిన స్టెప్స్ పాటిస్తే మీ పాన్‌ను ఆధార్‌తో సులభంగా అనుసంధానం చేయవచ్చు.
1. ఇంటర్నెట్ బ్రౌజర్‌ను పీసీలో ఓపెన్ చేసి అందులో https://www.incometaxindiaefiling.gov.in/home అనే ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
2. అక్కడ పేజీకి ఎడమ భాగంలో ఉండే Quick Links అనే సెక్షన్‌లోని Link Aadhaar అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. తరువాత వచ్చే పేజీలో మీ పాన్, ఆధార్ నంబర్ల వివరాలు, పేరును నమోదు చేయాలి. ఆధార్ లో ఉన్నట్లు పేరును తెలపాల్సి ఉంటుంది.
4. ఆధార్ కార్డులో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే చెక్ బాక్స్‌లో క్లిక్ చేయాలి. తరువాత యుఐడీఏఐతో ఆధార్ వివరాలను ధ్రువీకరించేందుకు చెక్‌బాక్స్‌లో క్లిక్ చేయాలి.
5. అనంతరం కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
6. తరువాత Link Aadhaar అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది.
ఇలా పాన్, ఆధార్‌లను అనుసంధానం చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…