కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అందరినీ కలవరపెడుతోంది. అయినప్పటికీ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ లను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కోవాగ్జిన్‌ను దేశంలోని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది.
కాగా కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లను ప్రస్తుతం భారత్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా 1 లక్ష డోసుల కోవాగ్జిన్ టీకాలను పరాగ్వేకు పంపించారు. ఆ డోసులను ఆ దేశం స్వీకరించింది. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ పరాగ్వేకు చేరుకుందని తెలిపారు.
పరాగ్వేలో ఇప్పటి వరకు 2,09,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 4063 మంది అక్కడ చనిపోయారు. భారత్ కేవలం పరాగ్వేకు మాత్రమే కాకుండా ఇప్పటి వరకు పలు ఇతర దేశాలకు కూడా కోవిడ్ టీకా డోసులను పంపిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 638.81 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ ఇతర దేశాలకు పంపించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…