పోస్టాఫీసుల్లో మనకు డబ్బును పొదుపు చేసుకునేందుకు అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ (ఎన్ఎస్‌సీ) కూడా ఒకటి. ఇందులో డబ్బును సురక్షితంగా పొదుపు చేయవచ్చు. కేవలం రూ.100 తో డబ్బును పొదుపు చేయడం ప్రారంభించవచ్చు. పెట్టే డబ్బుకు భారీ ఎత్తున వడ్డీని కూడా పొందవచ్చు. దీంతో కుటుంబ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
ఎన్ఎస్‌సీ కింద డబ్బును పొదుపు చేస్తే మెచూరిటీ గడువు 5 ఏళ్లు ఉంటుంది. అయితే 1 ఏడాది తరువాత కొన్ని షరతులకు లోబడి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ స్కీమ్‌లో పొదుపు చేసే డబ్బుకు ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరిస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు మారుతుంటాయి. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద పొదుపు చేసుకునే డబ్బులకు ఏడాదికి 5.9 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు.
ఈ స్కీమ్ కింద డబ్బును పొదుపు చేస్తే రూ.1.50 లక్షల వరకు ఆదాయపు పన్నులో మినహాయింపులు పొందవచ్చు. ఇన్‌కమ్‌ట్యాక్స్ చట్టం సెక్షన్ 80సి ప్రకారం పన్ను మినహాయింపులు పొందవచ్చు. 5 ఏళ్ల తరువాత మొత్తం డబ్బును లెక్కించి చెల్లిస్తారు. అయితే ప్రతి ఏటా అసలుకు వడ్డీని కూడా కలుపుతారు. తరువాత ఆ మొత్తానికి మరుసటి ఏడాదిలో వడ్డీ చెల్లిస్తారు. అందువల్ల వడ్డీకి వడ్డీ పొందవచ్చు.
ఇక ఈ స్కీమ్ కింద నెలకు రూ.100 పొదుపు చేయవచ్చు. 5 ఏళ్లలో రూ.15 లక్షలు పొదుపు చేస్తే 5.9 శాతం వడ్డీతో 5 ఏళ్ల తరువాత రూ.20.06 లక్షలు వస్తాయి. రూ.5.06 లక్షల వడ్డీ వస్తుంది. ఇలా ఈ పథకం ద్వారా అధిక మొత్తంలో డబ్బును పొదుపు చేసుకుని లాభం పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…