వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. మరి కొద్ది గంటల్లో వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని అమలు చేయనుంది. మే 15వ తేదీ నుంచి ఆ పాలసీ అమలులోకి వస్తుంది. అందువల్ల ఆ తేదీ మారే లోగా.. అంటే ఇంకొన్ని గంటల్లో వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీకి యూజర్లు ఓకే చెప్పాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్ సేవలను ఉపయోగించుకోలేరు.
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫిబ్రవరి 8వ తేదీ నుంచే తన నూతన ప్రైవసీ పాలసీని అమలు చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. అయితే దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడం, వాట్సాప్ యూజర్లు పెద్ద ఎత్తున టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లకు మారడంతో వాట్సాప్ దిగి రాక తప్పలేదు. దీంతో నూతన ప్రైవసీ పాలసీని మే 15వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఇక ఆ తేదీ రానే వచ్చింది.
అయితే వాట్సాప్ తన యూజర్లకు అందించే నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే అందులో పూర్తి స్థాయిలో సేవలను పొందలేరని తెలిపింది. నూతన పాలసీని ఓకే చేసేందుకు కొన్ని వారాల పాటు యూజర్లకు రిమైండర్లు పంపిస్తామని, అప్పటి వరకు పాలసీకి ఓకే చెప్పాలని తెలిపింది. అయితే అప్పటి వరకు వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను చూడలేరని, కానీ వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇక కొన్ని వారాల పాటు అలా కొనసాగినా, పదే పదే రిమైండర్స్ ఇచ్చినా నూతన పాలసీకి ఓకే చెప్పకపోతే అప్పుడు వాట్సాప్ సేవలను పూర్తి స్థాయిలో బ్లాక్ చేస్తారు. దీంతో యూజర్లు వాట్సాప్ సేవలను పొందలేరు. అప్పుడు పాలసీకి ఓకే చెప్పి మళ్లీ సేవలను యథావిధిగా వాడుకోవచ్చు. మరి మీక్కూడా పాలసీని అంగీకరించమని మెసేజ్‌లు వస్తుంటే వెంటనే ఓకే చెప్పేయండి, లేదంటే వాట్సాప్ సేవలను పొందలేరు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…