స‌మాచారం

Milk Adulteration: పాల‌లో నీళ్లు క‌లిపారా, యూరియా క‌లిపారా.. క‌ల్తీ జ‌రిగిందా.. అన్న విష‌యాన్ని ఇలా తెలుసుకోండి..!

Milk Adulteration: ప్ర‌స్తుత ప్ర‌పంచంలో ప్ర‌తీదీ క‌ల్తీమ‌యం అవుతోంది. క‌ల్తీ జ‌రుగుతున్న ఆహార ప‌దార్థాలను మ‌నం గుర్తించ‌లేక‌పోతున్నాం. దీంతో క‌ల్తీ ప‌దార్థాల‌ను తింటూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నాం. ఇక అత్యంత ఎక్కువ‌గా క‌ల్తీ అవుతున్న ప‌దార్థాల్లో పాలు నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలుస్తాయి. ఈ క్ర‌మంలోనే పాల‌లో క‌ల్తీ జ‌రిగితే ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* కొద్దిగా పాల‌ను తీసుకుని 2-3 గంట‌ల పాటు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. దీంతో కోవా త‌యార‌వుతుంది. అయితే అది నూనె త‌ర‌హాలో ఉంటే పాల‌లో క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌ని అర్థం. అలా కాకుండా గ‌ట్టిగా ఏదైనా ప‌దార్థంలా ఉంటే మాత్రం ఆ పాలు క‌ల్తీ అయ్యాయ‌ని గుర్తించాలి.

* కృత్రిమ పాల‌ను స‌బ్బులు, స‌హ‌జ‌సిద్ధ‌మైన పాల‌ను క‌లిపి త‌యారు చేస్తారు. అందువ‌ల్ల ఆ పాల రుచి తేడా ఉంటుంది. చెడ్డ రుచిని ఆ పాలు క‌లిగి ఉంటాయి. అలాగే స‌బ్బులా నుర‌గ క‌నిపిస్తుంది. వేడి చేస్తే ఆ పాలు ప‌సుపు రంగులోకి మారుతాయి.

* పాల‌లో నీళ్లు క‌లిపారా లేదా అనే విష‌యాన్ని కూడా సుల‌భంగానే గుర్తించ‌వ‌చ్చు. ఒక పాల చుక్క‌ను అర చేతిలో వేసి ఆ చుక్క కింద‌కు ప్ర‌వ‌హించేలా చేయాలి. ఆ చుక్క వెనుక ధార‌లా ఒక మార్గం ఏర్ప‌డితే ఆ పాలలో నీళ్లు క‌లిపార‌ని అర్థం. అలా జ‌ర‌గ‌క‌పోతే ఆ పాలు స్వ‌చ్ఛ‌మైన‌విగా భావించాలి.

* పాల‌లో పిండి క‌లిపినా గుర్తించ‌వ‌చ్చు. పాలను 5ఎంఎల్ మోతాదులో తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల అయోడైజ్డ్ సాల్ట్‌ను వేయాలి. త‌రువాత పాలు నీలి రంగులోకి మారితే ఆ పాలు స్వ‌చ్ఛంగా లేవ‌ని తెలుసుకోవాలి.

* పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఉత్ప‌త్తి దారులు అందులో ఫార్మాలిన్‌ను క‌లుపుతారు. అయితే దీంతో పాల‌ను క‌ల్తీ కూడా చేయ‌వ‌చ్చు. దాన్ని ఎలా గుర్తించాలంటే.. 10 ఎంఎల్ పాల‌ను ఒక టెస్ట్ ట్యూబ్‌లో తీసుకుని అందులో 2-3 చుక్క‌ల స‌ల్‌ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి. పాల‌పై బ్లూ రింగ్ క‌నిపిస్తుంది. అలా క‌నిపిస్తే పాలు క‌ల్తీ అయ్యాయ‌ని అర్థం.

* పాల‌లో యూరియా క‌లిపి వాటిని క‌ల్తీ చేస్తారు. చాలా మంది క‌ల్తీదారులు ఇలాగే చేస్తుంటారు. దీన్ని పసిగ‌ట్టాలంటే.. అర టేబుల్ స్పూన్ పాల‌ను అంతే మోతాదులో సోయాబీన్ పౌడ‌ర్‌తో క‌లిపి బాగా షేక్ చేయాలి. అనంత‌రం 5 నిమిషాలు ఆగాక ఆ మిశ్ర‌మంలో ఒక లిట్మ‌స్ పేప‌ర్ ను ముంచి 30 సెక‌న్ల పాటు ఉంచాలి. దీంతో ఎరుపు రంగు లిట్మ‌స్ పేప‌ర్ రంగు మారుతుంది. నీలి రంగులోకి మారితే పాలు క‌ల్తీ అయిన‌ట్లు లెక్క‌.

ఇలా పాలు క‌ల్తీ అయ్యాయో లేదో సుల‌భంగా చెక్ చేయ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM