ప్రజల నిత్యావసర వస్తువులలో ఒకటిగా ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ కొనాలన్నా సామాన్యులపై అధిక భారం పడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉంది. ఈ విధంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నప్పటికీ ఏడాదిలో 12 సిలిండర్లను ఉపయోగించే కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీని ఖాతాలో జమ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసి అందుకున్నాక కస్టమర్ ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమవుతున్నాయి.
ప్రస్తుతం సిలిండర్ ధరలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సబ్సిడీ డబ్బును కస్టమర్ల ఖాతాలలో వేయటం వల్ల కొంతమేరకు ఉపశమనం కలిగినప్పటికీ కొందరికి ఈ సబ్సిడీ డబ్బులు జమ కాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విధంగా సబ్సిడీ డబ్బులు వారి ఖాతాలలో జమ కాకపోవడానికి పలు కారణాలు ఉంటాయి.
తప్పనిసరిగా కస్టమర్లు వారి ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ తో లింక్ చేసి ఉండాలి. ఇలా చేయని నేపథ్యంలో వారికి సబ్సిడీ డబ్బులు జమ కావు. అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే జమవుతాయి. అంటే వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు పైగా వచ్చేవారికి సబ్సిడీ డబ్బులు అందవు. అయితే సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కాకపోతే వెంటనే కస్టమర్లు https://www.mylpg.in/ అనే వెబ్‌సైట్‌లో చెక్ చేయాలి. మీకు సబ్సిడీ డబ్బులు పడకపోతే వెంటనే డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి గ్యాస్ బుక్ వివరాలను ఇచ్చి సబ్సిడీ పడటం లేదని కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 కి ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…