మహిళలపై దేశంలో రోజు రోజుకీ వేధింపులు పెరిగిపోతున్నాయి. కొందరు శాడిస్టు భర్తలు చిన్న విషయాలకే తమ భార్యలపై దాడి చేస్తున్నారు. కొందరైతే ఏకంగా తమ భార్యలను హతమారుస్తున్నారు. మధ్యప్రదేశ్ లోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఉన్న గౌతమ్ నగర్‌కు చెందిన సమీర్, షబ్‌నమ్ ఖాన్ (35)లు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. షబ్‌నమ్ ఇంటికి సమీపంలోనే ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అయితే ఆమె పుట్టింటికి వెళ్లే విషయమై భర్తను అడిగింది. కానీ అందుకు సమీర్ ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే భార్యా భర్త మధ్య గొడవ పెరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సమీర్ రాత్రి 11 గంటల సమయంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. అనంతరం అతను ఇంటి నుంచి పారిపోయాడు.
తరువాత ఆమె పెద్దగా కేకలు వేయడంతో నిద్ర లేచిన ఆమె పెద్ద కుమారుడు ఇరుగు పొరుగు వారికి, తన అమ్మమ్మ, తాతలకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడికి చేరుకుని తమ కుమార్తెను హాస్పిటల్‌కు తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం 35 శాతం కాలిన గాయాలతో అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు సమీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…