కరోనా నేపథ్యంలో టీకాలను వేయించుకునేందుకు గాను ముందుగా స్లాట్‌లను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. అందుకుగాను ఆరోగ్యసేతు యాప్‌తోపాటు కోవిన్ పోర్టల్, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే టీకాలను వేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ ప్రక్రియను కేంద్రం మరింత సులభతరం చేసింది. ఇప్పుడు వాట్సాప్‌లో కూడా కోవిడ్ టీకా స్లాట్‌లను బుక్ చేయవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ ద్వారా కోవిడ్ టీకా స్లాట్‌ను బుక్ చేయాలంటే ఈ స్టెప్స్‌ను పాటించండి.
1. ముందుగా +919013151515 అనే నంబర్‌ను మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయండి. లేదా https://wa.me/919013151515 అనే సైట్‌ను సందర్శించండి.
2. వాట్సాప్‌లో Book Slot అని టైప్ చేసి పైన తెలిపిన నంబర్‌కు పంపించండి.
3. మీ ఫోన్ నంబర్ కు వచ్చే 6 అంకెల ఓటీపీ నంబర్‌ను వెరిఫై చేయండి.
4. మీకు సౌకర్యవంతంగా ఉండే తేదీ, ప్రాంతం, పిన్ కోడ్ వివరాలను, కావల్సిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎంచుకోండి.
5. మీ కోవిడ్ వ్యాక్సినేషన్ స్లాట్ కన్‌ఫామ్ అవుతుంది.
ఈ విధంగా వాట్సాప్‌లో కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేయవచ్చు.
ఇక కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు వాట్సాప్ ద్వారా కూడా ఆ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. అందుకు ఇలా చేయాలి.
1. ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో +919013151515 అనే నంబర్‌ను సేవ్ చేయాలి.
2. వాట్సాప్ ఓపెన్ చేసి అందులో covid certificate అని టైప్ చేసి పైన తెలిపిన నంబర్‌కు పంపించాలి.
3. ఓటీపీ ని ఎంటర్ చేయాలి.
4. మీ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…