Indian Railways : ఏదైనా ఊరు వెళ్లాలంటే, సులభంగా మనం ప్రయాణం చేయవచ్చని, రైలు మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటాము. ప్రతిరోజు 10,000 కు పైగా రైలు నడుస్తున్నాయి. చాలా మంది, వారి యొక్క గమ్య స్థానాలని చేరుకోవడానికి, రైలు ప్రయాణమే బెస్ట్ అని ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా, రైల్వే శాఖ సీనియర్ సిటిజన్ల కోసం అనేక రకాల సౌకర్యాలను తీసుకు వస్తూ ఉంటుంది. రాయితీలని అందించడానికి, కూడా చూస్తోంది.
ఇప్పుడు ఇండియన్ సిటిజెన్ల కోసం, కొన్ని ప్రయోజనాలను తీసుకువచ్చింది. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్సభలో ఈ సౌకర్యాలని హైలెట్ చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్లకి లోయర్ బర్త్ కన్ఫర్మేషన్ టికెట్లు అందించబడతాయి. బుకింగ్స్ సమయం లో సీట్లు అందుబాటులో ఉంటే, 45 ఏళ్ళు కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకి సౌకర్యం విస్తరించబడింది. థర్డ్ ఏసి కోచ్ లకి నాలుగు నుండి ఐదు లోయర్ బెర్తులు, సెకండ్ ఏసి కోచ్ల లో సీనియర్ సిటిజెన్ల కి, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీలకు మూడు నుండి నాలుగు సీట్లు కేటాయించారు.

కింది బెర్త్ అవసరమైన వాళ్ల కోసం ఈ సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. వయసు అర్హతలు, వికలాంగులు లేదా గర్భిణి స్త్రీలు వంటి నిర్దిష్ట ప్రయాణికులకు అనుగుణంగా ఉన్న సిబ్బందికి, లోయర్ బర్త్ సీట్లు మంజూరు చేయడానికి రూల్స్ ని రూపొందించారు.
పై బెర్తులు ఉన్న వ్యక్తులు బోర్డింగ్ సమయం లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఈ కొత్త రూల్ ని తీసుకువచ్చారు. సబ్సిడీ లు మరియు తగ్గింపులు పరంగా 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ టికెట్లు ధరపై, 40 శాతం తగ్గింపుతో గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతారు. 58 అంత కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళా ప్రయాణికులు 50 శాతం తగ్గింపును పొందుతారు.