మన దేశంలోని పౌరుల వద్ద ఉండాల్సిన ముఖ్యమైన పత్రాల్లో ఓటర్ ఐడీ కార్డు ఒకటి. కేవలం ఓటు వేసే సమయంలోనే కాదు, ఇతర సమయాల్లోనూ ఓటర్ ఐడీ కార్డు పనిచేస్తుంది. ఐడీ లేదా అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడీని ఉపయోగించుకోవచ్చు. భారత ఎన్నికల సంఘం మనకు ఓటర్ ఐడీ కార్డులను జారీ చేస్తుంది.
ఓటర్ ఐడీ కార్డు లేకపోతే దిగులు చెందాల్సిన పనిలేదు. ఆన్ లైన్‌లోనే సులభంగా ఓటర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అందుకు గాను కింద తెలిపిన స్టెప్స్ ను పాటించాలి.
* ఓటర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేయాలంటే ముందుగా ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://voterportal.eci.gov.in ను సందర్శించాలి.
* తరువాత Voter Service Portal (NVSP) ని https://www.nvsp.in/Account/Login వెబ్‌సైట్‌లో సందర్శించాలి.
* అయితే ఇందుకు గాను అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేకపోతే కొత్తగా ఒక అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. అందుకు మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌లను ఇవ్వాలి.
* అకౌంట్ క్రియేట్ చేశాక కొన్ని వివరాలను అడుగుతారు. ఆ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
* లాగిన్ అయ్యాక e-EPIC కార్డును డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
* డౌన్ లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే ఓటర్ ఐడీ కార్డు పీడీఎఫ్ ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది.
దాన్ని అవసరం అనుకుంటే ప్రింట్ తీయించి లామినేషన్ చేసుకోవచ్చు. ఓటర్ ఐడీ కార్డు వల్ల సులభంగా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. భారత ఎన్నికల సంఘం ఓటర్లకు కొత్త కార్డులను అందించేందుకు గాను ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధంగా ఎవరైనా సరే తమ ఓటర్ ఐడీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…