Ayushman Bharat : భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీము వలన చాలా ప్రయోజనం ఉంటుంది. దేశంలోని నిరుపేద పౌరులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందించడానికి, ఈ స్కీము ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. అర్హులైన వ్యక్తులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య చికిత్స ని అందించడం, ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద, BPL రేషన్ కార్డ్ హోల్డర్లు అలానే రాష్ట్రీయ భీమా పథకం కింద నమోదు చేసుకున్న వాళ్ళు ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రతి కుటుంబానికి, సంవత్సరానికి రూ. 5,00,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. రిజిస్టర్డ్ హెల్త్‌కేర్ సౌకర్యాలలో ఉచిత చికిత్సను కూడా పొందవచ్చు. APL కార్డ్‌లు లేదా నాన్-బిపిఎల్ కార్డ్‌లను ఉంటే, చికిత్స ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వ ప్యాకేజీ రేట్లలో కవర్ చేయడం జరుగుతుంది. ఒక్కో కుటుంబానికి వార్షిక పరిమితి రూ. 1,50,000.
భూమిలేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, రోజువారీ కూలీలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులకు ఈ స్కీము తాలూకా లాభాలు ఉంటాయి. ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు ని ఈజీగా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఈజీగా దరఖాస్తు చేయచ్చు. http://beneficiary.nha.gov.inకి లాగిన్ చేసి, అధికారిక ఆయుష్మాన్ భారత్ వెబ్‌సైట్‌ను చూడండి. బెనిఫిషియరీ మీద క్లిక్ చేసి, నంబర్‌ను ఇవ్వండి. ఓటీపీ వస్తుంది. రేషన్ కార్డ్ విభాగం కోసం చూడండి. మీ కుటుంబం పేరును కనుగొని, కార్డ్ ఉద్దేశించిన వ్యక్తి వివరాలను ఎంటర్ చేయాలి.
మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయమని ప్రాంప్ట్ చేయబడ్డాక ఓటీపీ వస్తుంది. ఆ తరవాత, సమ్మతి పత్రం వస్తుంది. అవి చూసాక, అనుమతించు అనే బటన్‌ను క్లిక్ చేయండి. “E-KYC ఆధార్ OTP” ని సెలెక్ట్ చేయండి. ఆధార్ ధృవీకరణ తర్వాత, క్యాప్చా ఇవ్వండి. మీ మొబైల్ కెమెరాను ఉపయోగించి ఫోటో తీయండి. ప్రొసీడ్ పై క్లిక్ చేయండి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…