Gold Price : బంగారం కొనడం ఈజీ కాదు. ఎన్నో డబ్బులు ఖర్చు పెడితే కానీ బంగారం రాదు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి, చాలామంది డబ్బులు దాచుకుంటూ ఉంటారు. నిజానికి ఒంటి మీద బంగారం స్టేటస్ ని సూచిస్తుంది. అందుకే, చాలామంది బంగారు నగలను వేసుకోవాలని చూస్తుంటారు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. పాకిస్తాన్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడు మనకి ఆశ్చర్యమైన విషయాలు పాకిస్తాన్ కి సంబంధించి బయటకి వస్తుంటాయి.
పాకిస్తాన్ లో బంగారం ధర ఎంత ఉంటుంది అనుకుంటున్నారు..? దేశానికి దేశానికి మధ్య ధరలు మారుతూ ఉంటాయి. భారతదేశంలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారు ధర ప్రస్తుతం రూ. 55 ,960 రూపాయలుగా ఉంది. పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.78 లక్షల రూపాయలుగా ఉంది. వామ్మో రెండు దేశాలకి మధ్య బంగారం ధరలులో ఇంత ఎంత తేడా ఉందో చూసారా..?

పాకిస్తాన్లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల లక్షన్నరకి పైగానే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఏంటి పాకిస్తాన్లో బంగారం ఎంత ఎక్కువ అని, అంతా ఆశ్చర్యపోతున్నారు. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం ఇండియా లో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 56,500. 24 క్యారెట్ల బంగారం ధర 61,640.
వెండి కిలో ధర వచ్చేసి 75,000 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640. విజయవాడ, విశాఖపట్నం లో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.56,650, 24 క్యారెట్ల ధర రూ.61,790. ముంబైలో 22 క్యారెట్ల రూ.56,500, 24 క్యారెట్ల ధర 61,640. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,150, 24 క్యారెట్ల ధర రూ.62,350.