Credit Card : బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ వలన చెల్లింపుల విషయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రెడిట్ కార్డుల రాకతో నగదురహిత చెల్లింపులు వేగంగా వృద్ధి చెందాయి. అయితే క్రెడిట్ కార్డులను సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో నష్టాలని ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా అసురక్షిత వెబ్‌సైట్‌లలో, అవిశ్వసనీయ వ్యాపారుల వద్ద క్రెడిట్ కార్డ్ వాడితే తప్కక మోసపోతారు.. ఎస్ఎస్ఎల్ ఎన్‌క్రిప్షన్ అనేది మీ బ్రౌజర్ లేదా వెబ్‌సైట్ సర్వర్ మధ్య డేటా ట్రాన్స్ ఫర్ అనేది పకడ్బందీగా ఉందని నిర్ధారిస్తుంది. ఇక మీరు లావా దేవీలు జరిపే సమయంలో వెబ్‌సైట్‌లు యూఆర్ఎల్ ప్రారంభంలో ప్యాడ్‌లాక్ లేదా ట్యూన్ ఐకాన్ (క్రోమ్ లో)తో “https://” ఉండేలా తప్పనిసరి చూసుకోవాలి.
ఇక మీరు రైల్వే స్టేషన్స్, విమానాశ్రయాలు లేదా హోటళ్లలో ఉన్న పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు ఉపయోగిస్తే వాటి ద్వారా హ్యాకర్‌లు సులభంగా డేటాను దొంగిలిస్తారు .మొబైల్ డేటా అనేది ఎప్పుడూ సురక్షితం. ఇక షేర్డ్ కంప్యూటర్ అనేది కూడా సురక్షితం కాదు. పబ్లిక్ వైఫై,పబ్లిక్ లైబ్రరీలు, ఇంటర్నెట్ కేఫ్‌లు, పాఠశాలల్లోని షేర్డ్ కంప్యూటర్‌లు ద్వారా కూడా సమాచారం దొంగిలించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. షాపింగ్ యాప్‌లతో కూడా జాగ్రత్తగా ఉండాలి.అన్ఆథరైజ్డ్ దుకణాలు, షాపింగ్ యాప్స్‌లలో కూడా క్రెడిట్ కార్డ్‌ని వాడొద్దు. అలాంటి చోట్ల క్రెడిట్ కార్డు వాడాల్సి వస్తే వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించండి.
ట్రయల్ సబ్‌స్క్రిప్షన్స్ విషయానికి వస్తే ఉచిత యాక్సెస్ వాగ్దానంతో చాలా వరకు కంపెనీలు ట్రయల్ సబ్ స్క్రిప్షన్ అందిస్తాయి. అయితే దీనిని యాక్టివేట్ చేయడానికి తరచుగా క్రెడిట్ కార్డ్ అవసరం ఉంటుంది. ట్రయల్ వ్యవధి ముగిసిన తర్వాత, మీ కార్డ్ పూర్తి సభ్యత్వం కోసం స్వయంచాలకంగా చార్జ్ చేయడం జరుగుతుంది. కొన్ని కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ట్రయల్‌ని రద్దు చేయడం కష్టతరం అవుతుంది. అలా చేస్తే ఊహించని ఖర్చులకి దారి తీస్తుంది. ఇలాంటి సమస్యలని నివారించడానికి, ట్రయల్‌ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు వర్చువల్ కార్డ్‌ని ఉపయోగించడం మేలు అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…