PM Mudra Loan : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తాజాగా పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలను పలు అంశాల్లో వెల్లడించారు. ముఖ్యంగా ముద్ర రుణాల పరిమితిపై ఆమె పలు ముఖ్యమైన విషయాలను ప్రకటించారు. ముద్ర పథకం కింద ఔత్సాహికులకు ఇస్తున్న రుణ పరిమితిని పెంచినట్లు ఆమె తెలియజేశారు. దీని వల్ల ఎలాంటి హామీ లేకుండానే లబ్ధిదారులు భారీ ఎత్తున రుణం పొందవచ్చు. ఇప్పటి వరకు ముద్రలో పలు విభాగాల్లో గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేవారు. అయితే ఈ పరిమితిని తాజాగా పెంచారు.
కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8వ తేదీన ముద్ర పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ఔత్సాహికులకు చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఎలాంటి హామీ లేకుండానే తక్కువ వడ్డీకే రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ రుణ పరిమితిని కేంద్రం తాజాగా రూ.20 లక్షలకు పెంచింది. దీంతో లబ్ధిదారులు గరిష్టంగా ఇప్పుడు ఎలాంటి హామీ లేకుండా ఏకంగా రూ.20 లక్షల మేర రుణం తీసుకోవచ్చు.
ఇక ఇప్పటికే ముద్ర రుణాలను తీసుకుని సకాలంలో రుణాలను చెల్లించిన వారు రూ.20 లక్షల మొత్తాన్ని తీసుకునేందుకు అర్హులని ప్రకటించారు. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు కూడా ఈ పథకం కింద రుణాన్ని పొందవచ్చు. దీని కింద చిన్న తయారీ యూనిట్లు, దుకాణదారులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు, సర్వీస్ సెంటర్లు, ఆర్టిస్టులు వంటి వారు రుణాలను పొందవచ్చు.
ఇక ఈ పథకంలో మొత్తం 3 విభాగాలు ఉన్నాయి. చైల్డ్ లోన్ కింద రూ.50వేల వరకు రుణం ఇస్తారు. అయితే కిశోర్ రుణం కింద అయితే గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అదే తరుణ్ విభాగం కింద అయితే ప్రస్తుతం పెంచిన పరిమితి ప్రకారం ఏకంగా రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దీంతో వ్యాపారం లేదా పరిశ్రమ స్థాపించి స్వయం ఉపాధి పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…