ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వాక్సిన్ ఇవ్వాలని సూచించడంతో ఇప్పుడు వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుంది? వ్యాక్సిన్ కోసం ఎక్కడికి వెళ్లాలి? అనే విషయాలు తెలియక గందరగోళ పరిస్థితి తలెత్తుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ పొందడం ఎలా అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెబుతోంది.
9013151515 అనే నెంబర్ ద్వారా మన ఉన్న ప్రాంతంలో ఎక్కడ వ్యాక్సిన్ లభిస్తుందో తొందరగా తెలుసుకోవచ్చు. ముందుగా ఈ నెంబర్ ని మన ఫోన్ లో సేవ్ చేసుకుని వాట్సప్ లోకి వెళ్లి ఈ నెంబర్ ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే హాయ్ అని మెసేజ్ టైప్ చేసి పంపగానే వెంటనే మనకు రిప్లై వస్తుంది. ఇప్పుడు మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీ ప్రాంతంలో ఎక్కడ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయో ఆ జాబితా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది.
ఈ విధంగా పిన్ కోడ్ ఎంటర్ చేయగానే కొన్ని ప్రాంతాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాలేదు అనే సమాధానం కూడా వస్తోంది.అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం 45 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే మొదటి, రెండవ డోసు వ్యాక్సిన్ అందిస్తున్నారు.అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా 18 సంవత్సరాలు పైబడిన వారి అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే మరికొన్ని నెలలు వేచి ఉండాలని తెలుస్తోంది.