ప్రస్తుతం ఏ ప్రభుత్వ పథకాలైనా, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన పనులు జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఆధార్ కార్డు లేనిదే ఏ పనులు జరగడం లేదు. ఒక సిమ్ కార్డు నుంచి మొదలు కొని బ్యాంక్ లోన్ వరకు ప్రతి చిన్న పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఇలా ఎంతో ముఖ్యమైన ఆధార్ కార్డులో మన వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే మన పనులన్నీ జరుగుతాయి. అయితే కొందరి ఆధార్ కార్డులలో పుట్టిన తేదీలు, లింగం వంటివి తప్పుగా పడుతుంటాయి. అలాంటి తప్పులను సరి చేయాలంటే నియమాలు ఎంతో కఠినంగా ఉంటాయి. మరి ఈ విధమైనటువంటి తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి అంటే..?
పుట్టిన తేదీ వివరాలను, లింగం వంటి వివరాలలో తప్పు పడితే వాటిని సరి చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నది కనుక వాటిని నింపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలాంటి వివరాలు తప్పుగా పడితే దరఖాస్తుదారుడు ఏదైనా ఆధార్ సెంటర్ కి వెళ్లి అక్కడ లింగం, పుట్టినతేదీ వివరాలను సరిచేసుకోవచ్చు.
ఆధార్ కేంద్రంలో ఉండే సిబ్బంది ఈ విధమైనటువంటి తప్పులను సరి చేయడానికి తిరస్కరిస్తే దరఖాస్తుదారులు వెంటనే 1947 నంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అవసరమనుకుంటే దరఖాస్తుదారుడు help@uidai.gov.in కు ఒక మెయిల్ కూడా పంపవచ్చు. దీని ఆధారంగా ఆధార్ లేదా UIDAI ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…