దేశంలో ఐటీ రంగంలో రెండో అతి పెద్ద సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ ఇటీవలే భారీ ఎత్తున గ్రాడ్యుయేట్ల కోసం కొత్తగా రిక్రూట్‌మెంట్‌ను చేపట్టిన విషయం విదితమే. మొత్తం 20వేల పోస్టుల భర్తీకి గాను ఇన్ఫోసిస్ నియామక ప్రక్రియను ప్రారంభించింది. అది కొనసాగుతోంది. అయితే తాజాగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాల్లో పనిచేసేందుకు అవసరమైన నిపుణుల ఉద్యోగల కోసం ఇన్ఫోసిస్ మళ్లీ నియామక ప్రక్రియను చేపట్టింది.
ఐటీ రంగంలో పలు విభాగాల్లో కొన్నేళ్ల పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ప్రిన్సిపాల్ ఆర్కిటెక్స్, జావా మైక్రో సర్వీసెస్‌లో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, టెక్నాలజీ అనలిస్ట్ – మెర్న్ స్టాక్, టెక్నాలజీ లీడ్ – రియాక్ట్ జేఎస్, కన్సల్టెంట్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ – బిగ్ డేటా, అజుర్ డెవ్ ఓపీఎస్ వంటి విభాగాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న, నిపుణులైన ఉద్యోగుల నుంచి ఇన్ఫోసిస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దేశంలో ఉన్న బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై, భువనేశ్వర్, ముంబైతోపాటు హైదరాబాద్‌లోనూ ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. కాగా మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు అనే వివరాలను వెల్లడించలేదు. కానీ ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇన్ఫోసిస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…