Smart Phone Camera Tricks : స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఫొటోలు తీయడం, సోషల్ సైట్లలో పెట్టడం, లైకులు, కామెంట్లు కొట్టించుకోవడం నేడు ఎక్కువైపోయింది. ఇక మరీ సెల్ఫీలు రాగానే ఆ యావ ఇంకా ఎక్కువైందనే చెప్పవచ్చు. అయితే ఎంత స్మార్ట్‌ఫోన్ అయినా, పవర్‌ఫుల్ కెమెరా ఉన్నా.. కొన్ని సార్లు మనం వాటిల్లో తీసే ఫొటోలు నాసిరకంగా వస్తాయి. అందుకు కారణాలు అనేకం ఉంటాయి. అయితే అలా ఫొటోలు నాసిరకంగా రాకుండా, మంచి క్వాలిటీతో రావాలంటే అందుకు కింద చెప్పిన పలు టిప్స్ ఉపయోగపడతాయి. మరి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
సెల్ఫీలు తీసుకోవడంలో కొన్ని సార్లు ఇబ్బందులు వస్తుంటాయి. సాధారణ ఫొటోలు అయినా సరే ఒక్కోసారి సమస్య అవుతుంది. ఈ క్రమంలో ఫొటోలో అందరూ రావాలి ఎవరూ మిస్ కాకూడదు, అనే ప్రాబ్లం కూడా వస్తుంటుంది. అలాంటప్పుడు ఫొటో ఎవరు తీస్తారు అని అందరూ సందేహిస్తుంటారు. అయితే అంతలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. చిత్రంలో చూపినట్టుగా ఒక ప్లాస్టిక్ కార్డును రెండు మడతలు వచ్చేట్టుగా మడవాలి. ఒక మడతలో ఫోన్ పెట్టాలి. అనంతరం టైమర్ ఉపయోగించి ఫొటో తీసుకోవచ్చు. దీంతో ఎవరూ మిస్ కాకుండా అందరూ ఒకే ఫొటోలో వస్తారు.
చిత్రంలో చూశారుగా. దాన్నే మినియేచర్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్ట్ కావాలంటే డీఎస్ఎల్ఆర్ కెమెరాయే అవసరం లేదు, మీ స్మార్ట్ ఫోన్ ఉన్నా చాలు. దాంట్లో రోల్ వరల్డ్ అనే యాప్ వేసుకుంటే దాంతో చిత్రంలో ఇచ్చినట్టుగా మినియేచర్ ఎఫెక్ట్‌తో ఫొటోలు తీసుకోవచ్చు.
ఒక్కోసారి ఫొటోలకు తగినంత కాంతి అవసరం అవుతూ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్, ప్లేస్ మార్చలేం. అలాంటప్పుడు కాంతి కోసం టిన్ లేదా సిల్వర్ ఫాయిల్‌ను ఉపయోగించి దానిపై లైట్ పడేలా చేసి దాని నుంచి వచ్చే కాంతిని సబ్జెక్ట్‌పై పడేలా చేస్తే చాలు, దాంతో ఫొటోలు క్వాలిటీగా వస్తాయి.
చిన్నపాటి టార్చిలైట్ లేదా లేజర్ పాయింటర్‌కు ఉండే లెన్స్‌ను తీయండి. వాటిని ఫోన్ కెమెరాపై ఫిక్స్ చేయండి. అనంతరం ఫోన్‌తో ఫొటోలు తీస్తే చిత్రంలో ఇచ్చినట్టుగా మాక్రో షాట్స్ వస్తాయి. ఇలాంటి షాట్స్ తీసి మీరు మీ స్నేహితులను ఆశ్చర్యపరచవచ్చు.
ఈ మధ్య కాలంలో డ్రోన్ కెమెరాలను వాడడం సర్వ సాధారణం అయిపోయింది. దీంతో ఫొటోలు బాగా వస్తాయి. గాలిలో నుంచి కిందకు ఫొటోలు తీయవచ్చు. అయితే డ్రోన్ అక్కర్లేకున్నా మీ స్మార్ట్ ఫోన్‌తో అలాంటి ఫొటోలు తీయవచ్చు. అందుకు ఒక హీలియం బెలూన్‌ను తీసుకుని దానికి టేప్‌తో స్మార్ట్‌ఫోన్‌ను అంటించాలి. అనంతరం బెలూన్‌ను గాలిలోకి ఎగరేసి టైమర్ సహాయంతో ఫొటోలు తీయవచ్చు. అయితే ఈ ట్రిక్ చేసేటప్పుడు ఫోన్‌ను బెలూన్ కు గట్టిగా అతికించాలి. లేదంటే కింద పడి పగిలేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకైనా మంచిది ఈ ట్రిక్ పాటించేటప్పుడు ఫోన్‌కు ప్రొటెక్షన్ కేస్ వేయండి.
స్మార్ట్ ఫోన్ కెమెరా యాప్‌లో పలు రకాల ఫిల్టర్లు ఉంటాయి. వాటితో భిన్నమైన కలర్ షేడ్స్ వచ్చేలా ఫొటోలను తీసుకోవచ్చు. అయితే అలా కాకుండా కలర్ పేపర్స్‌ను కలిపి ఫోన్ కెమెరా లెన్స్‌కు అడ్డుగా పెట్టి వాటితో కూడా భిన్నమైన కలర్ షేడ్స్ వచ్చేలా ఫొటోలను తీయవచ్చు. అయితే ఇలా తీసిన ఫొటోలు నాచురల్ అనిపిస్తాయి.
మీరు వాడే సన్ గ్లాసెస్‌ను ఫోన్ కెమెరాకు అడ్డుగా పెట్టి ఫొటోలు తీస్తే ఆ ఫొటోలు పోలరైజ్డ్ ఎఫెక్ట్ తో వస్తాయి. చూసేందుకు ఆ ఫొటోలు బాగుంటాయి.
నేటి తరుణంలో వస్తున్న అనేక ఫోన్లలో కెమెరా యాప్‌లలో హెచ్‌డీఆర్ ఫీచర్ లభిస్తోంది. దీంతో ఫొటోలు తీసేందుకు యత్నించండి. బాగా కలర్‌ఫుల్‌గా వస్తాయి. కాంతి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ ఫీచర్‌తో ఫొటోలు తీస్తే అవి నాణ్యంగా వస్తాయి.
మీ ఫోన్‌తో మీరు అండర్ వాటర్ ఫోటోలు తీయవచ్చు. అందుకు ఫోన్‌ను ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి దాన్ని చిత్రంలో చూపినట్టుగా గ్లాస్ నీటిలో వేయండి. టైమర్ ద్వారా ఫొటోలు తీయండి. అద్భుతంగా వస్తాయి.
మీ ఫోన్ కెమెరా లెన్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. ఎరేజర్‌ను వాడి ఆ లెన్స్‌ను క్లీన్ చేస్తే అవి శుభ్రంగా అవుతాయి. దీంతో ఫొటోలు బాగా వస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…