Toll Gate : టోల్ గేట్లు ఉన్న చోట టోల్ ట్యాక్స్ కట్టకుండా వెహికిల్ తో వెళ్లడం చాలా కష్టం. ఎవరైనా టోల్ కట్టాల్సిందే. ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి ఇలా కొందరు ప్రముఖులు తప్ప ప్రతి ఒక్కరు టోల్ ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. ప్రభుత్వం ప్రజల రవాణా సౌకర్యార్థం ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్తగా నిర్మించిన లేదా నిర్మించబోయే జాతీయ రహదారులపై టోల్ టాక్స్ వేస్తారని మనకు తెలుసు. అయితే ఈ రోడ్లపై టోల్ ట్యాక్స్ కట్టడానికి మనకు కూడా మినహాయింపు ఉంటుంది. కానీ అదెప్పుడు పడితే అప్పుడు కాదు. ఒకట్రెండు సంధర్బాలలో మాత్రమే. ఆ రెండు సంధర్బాలు ఏంటో తెలుసుకుని, మీకు ఇకపై అలాంటి పరిస్థితి ఎదురైతే టోల్ కట్టకుండా ఎంచక్కా వెళ్లిపోండి. ఎవరన్నా ఏమన్నా అడిగితే రూల్స్ చెప్పండి.
టోల్ గేట్ నుంచి 200 మీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయితే మనం టోల్ కట్టకుండానే గేట్ దాటి వెళ్లవచ్చు. టోల్ గేట్ కు కొద్ది దూరంలో ఒక పసుపు రంగు లైన్ ఉంటుంది. ఆ లైన్‌కు అవతల ఎవరైనా 5 లేదా అంతకన్నా ఎక్కువ నిమిషాల పాటు వేచి ఉన్నట్టయితే వారు కూడా టోల్ కట్టాల్సిన పనిలేదు. నేరుగా గేట్ నుంచి వెళ్లిపోవచ్చు. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు గనక ఎదురైతే టోల్ చెల్లించకండి. ఒక వేళ టోల్ సిబ్బంది ఇబ్బంది పెట్టినా, వాదించినా.. ఈ 2 రూల్స్ ను కచ్చితంగా చెప్పండి.
సందు దొరికితే సామాన్యున్ని బాదడానికి చూసే టోల్ సిబ్బంది అంత సులువుగా మనల్ని వదులుతారా అంటే అనుమానమే. ఎందుకంటే మనమేం రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తారు కానీ, వాళ్ల గురించి మనం రూల్స్ మాట్లాడితే మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఒక టోల్ వ్యవస్థే కాదు ప్రతి వ్యవస్థ ఇలాగే ఉంది. కనుక ఇవి తెలుసుకుని ముందు సాగడం మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…