Jio Rs 75 Prepaid Plan : ఈమధ్యనే టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. దాదాపుగా 20 నుంచి 30 శాతం మధ్య ఈ చార్జిలను పెంచారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌లోకి మారిపోతున్నారు. అయితే తమ వినియోగదారులను కాపాడుకునేందుకు గాను సదరు కంపెనీలు తక్కువ ధరలు కలిగిన ప్లాన్లను మళ్ల అందుబాటులోకి తెస్తున్నాయి. అందులో భాగంగానే జియో కూడా ఒక ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. అయితే ఈ ప్లాన్ ప్రత్యేకంగా కేవలం జియో ఫోన్ కలిగిన వారికే వర్తిస్తుంది. ఇక ఈ ప్లాన్ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జియో ఫోన్ ఉన్నవారు అత్యంత చవకైన ప్లాన్ కావాలనుకుంటే వారు రూ.75తో రీచార్జి చేసుకోవచ్చు. దీంతో ఈ ప్లాన్‌లో 23 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఎంబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా 23 రోజుల వాలిడిటీకి గాను 2.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే డేటా అయిపోగానే ఇంటర్నెట్ స్పీడ్ అనేది 64 కేబీపీఎస్‌కు తగ్గించబడుతుంది. ఇక ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 50 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. కానీ కాల్స్‌ను అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకోవచ్చు.
మరో ప్లాన్ కూడా..
డేటా వినియోగం పెద్దగా ఉండదు అనుకునేవారు జియో ఫోన్ ద్వారా రూ.75 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవచ్చు. అయితే ఇందులోనే ఇంకాస్త ఎక్కువ డేటా కావాలనుకుంటే అలాంటి వారు రూ.125తో రీచార్జి చేసుకోవచ్చు. దీంట్లో కస్టమర్లకు పైన ప్లాన్ లాగే 23 రోజుల వాలిడిటీ ఉంటుంది. కానీ రోజుకు 500 ఎంబీ డేటా వస్తుంది. మొత్తంగా 11.5 జీబీ డేటాను ఈ వాలిడిటీలోగా ఉపయోగించుకోవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఎస్ఎంఎస్‌లను కూడా ఉచితంగా ఇస్తారు. ఇక ఈ రెండు ప్లాన్లకు కూడా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి యాప్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు.
ఈ రెండు ప్లాన్లను మీరు ఎక్కడైనా రీచార్జి చేసుకోవచ్చు. మై జియో యాప్‌లో లేదా జియో వెబ్ సైట్‌లో ఈ ప్లాన్‌లను రీచార్జి చేసుకోవచ్చు. లేదా గూగుల్ పే, ఫోన్ పేలను కూడా ఉపయోగించవచ్చు. దీంతో మీ జియో ఫోన్‌లో ఈ ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చు. డేటా వినియోగం పెద్దగా ఉండదు, కాల్స్ మాత్రమే కావాలని అనుకునేవారు ఈ ప్లాన్లను జియో ఫోన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…