వినోదం

Harish Shankar : హ‌రీష్ శంక‌ర్‌ను దారుణంగా అవ‌మానించిన నెటిజ‌న్‌.. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌పై దారుణ‌మైన ట్రోల్స్‌..

Harish Shankar : ర‌వితేజ‌, హ‌రీష్ శంక‌ర్‌ల కాంబినేష‌న్ అంటే స‌హ‌జంగానే ప్రేక్ష‌కుల్లో ఎంతో కొంత ఆస‌క్తి ఉంటుంది. గ‌తంలో వీరు క‌ల‌సి తీసిన మిర‌ప‌కాయ్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ ఇద్ద‌రూ క‌ల‌సి మ‌రోసారి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ పేరిట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ మూవీ ఆగ‌స్టు 15, 2024న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఇందులో ర‌వితేజ స‌ర‌స‌న భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ వారు నిర్మించారు. దీనికి టీజీ విశ్వ ప్ర‌సాద్ నిర్మాత‌.

అయితే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ రిలీజ్‌కు ముందు మంచి బ‌జ్‌ను క్రియేట్ చేసింది. క్రేజీ కాంబినేష‌న్ కావ‌డం, సినిమాపై హైప్ పెంచ‌డంతో స‌హ‌జంగానే మూవీ ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. కానీ మూవీ రిలీజ్ అయ్యాక మాత్రం నెగెటివ్ టాక్ పెరిగిపోయింది. పాజిటివ్ టాక్ క‌న్నా నెగెటివ్ టాక్ ఎక్కువ‌గా వ‌స్తోంది. దీంతో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ నెగెటివ్ టాక్ ఇచ్చే వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టి ట్విట్ట‌ర్‌లో పాజిటివ్‌గా టాక్ ఇస్తున్న వారికి రిప్లై ఇస్తున్నారు. అయితే ఇలాగే ఓ నెటిజ‌న్‌కు కూడా ఆయ‌న రిప్లై ఇచ్చారు. కానీ దెబ్బ‌కు ఆయ‌న‌కు షాక్ త‌గిలింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Harish Shankar

హ‌రీష్ శంక‌ర్ రిప్లై..

ప‌వ‌న్ కృష్ణ అనే ఓ నెటిజ‌న్ ట్విట్ట‌ర్‌లో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీకి ముందుగా పాజిటివ్‌గానే రివ్యూ ఇచ్చాడు. ఫేక్ రివ్యూల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని, మూవీ చాలా బాగుంద‌ని, ర‌వితేజ అన్న‌కు హ‌రీష్ శంక‌ర్ శంక‌ర్ అన్న మంచి క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు, థాంక్ యూ అన్న అంటూ హ‌రీష్ శంక‌ర్‌కు ఈ ట్వీట్‌ను ఆ నెటిజ‌న్ ట్యాగ్ చేశాడు. దీంతో హ‌రీష్ శంక‌ర్ రివ్యూ పాజిటివ్‌గా ఉంద‌ని చెప్పి రిప్లై ఇచ్చారు. అయితే అక్క‌డే ఆయ‌న‌కు దిమ్మ తిరిగిపోయింది.

నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు..

ఇక హ‌రీష్ శంక‌ర్ ఇచ్చిన రిప్లైకి స్పందించిన స‌ద‌రు నెటిజ‌న్ మ‌ళ్లీ ట్వీట్ చేశాడు. నువ్వు రిప్లై ఇస్తావ‌నే నేను మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చా.. అంటూ బూతులు మాట్లాడాడు. దీంతో ఖంగు తిన‌డ‌డం హ‌రీష్ శంక‌ర్ వంతైంది. అయితే ఈ ట్వీట్ల‌కు చెందిన స్క్రీన్ షాట్స్‌ను నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తూ.. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అస‌లు సినిమాను ఇలా కూడా తీస్తారా.. ఇంత చండాల‌మైన సినిమాను ఎప్పుడూ చూడలేదు.. అంటూ దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. అయితే సినిమా ఫ‌లితం ఎలా ఉంది అనేది తేలాలంటే.. మ‌రికొద్ది రోజుల వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM