BSNL Signal : టెలికాం కంపెనీలు మొబైల్ రీచార్జి ధరలను విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్‌టెల్, జియో, వీఐ కంపెనీలు రీచార్జి ధరలను ఇటీవల పెంచేశాయి. దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయా నెట్‌వర్క్‌లలో ఉండలేక చాలా మంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. అయితే బీఎస్ఎన్ఎల్‌కు గాను దేశంలో ఇంకా 4జి రాలేదు. 3జి సేవలే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు దేశమంతటా బీఎస్ఎన్ఎల్ 4జి సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పింది.
అయితే ఇతర కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్‌లో మొబైల్ రీచార్జి ధరలు తక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఆ నెట్‌వర్క్‌కు మారుతున్నారు. అయితే బీఎస్ఎన్ఎల్‌కు వాస్తవానికి 4జి టవర్లు ఎక్కువగా లేవు. కనుక మీరు కూడా బీఎస్ఎన్ఎల్‌కు మారిపోవాలని చూస్తుంటే ముందుగా మీరు మీ ప్రాంతంలో 4జి టవర్ ఉందా.. లేదా.. అన్నది తెలుసుకోవాలి. దీంతో మీరు బీఎస్ఎన్ఎల్‌లోకి మారిపోయినా నెట్‌వర్క్ పరంగా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ సిగ్నల్ మీ ప్రాంతంలో ఎలా ఉందో తెలుసుకోవాలంటే అందుకు కింద చెప్పిన ఓ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీరు మీ ఇంటర్నెట్ బ్రౌజర్‌లోకి వెళ్లి అక్కడ https://tarangsanchar.gov.in/emfportal అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో కిందకు వెళ్లి అక్కడ ఉండే my position అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం తెరపై మీ పేరు, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, కాప్చాను ఎంటర్ చేయాలి. తరువాత ఓటీపీని ఎంటర్ చేసి మెయిల్‌కి పంపుపై క్లిక్ చేయాలి. అనంతరం ఓటీపీని ఎంటర్ ఏయాలి. అప్పుడు వచ్చే తెరపై మీకు మీ సమీపంలోని అన్ని సెల్‌ఫోన్‌ల టవర్ల మ్యాప్ కనిపిస్తుంది. అందులో సిగ్నల్ 2G/3G/4G లేదా 5Gని మీరు చూడవచ్చు. మీకు ఆపరేటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీ ఏరియాలో BSNL సిగ్నల్ ఎలా ఉందో చెక్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…