మొబైల్ ఉత్పత్తుల తయారీదారు లావా బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. తన నూతన వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.1 కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో వినియోగదారులు కేవలం రూ.1 చెల్లించి ఆ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు.
లావాకు చెందిన ప్రొబడ్స్ ఇయర్ బడ్స్‌ను ఈ ఆఫర్ కింద రూ.1కే కొనుగోలు చేయవచ్చు. లావా ఆన్‌లైన్ స్టోర్ లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి సదరు ఇయర్ బడ్స్‌ను విక్రయిస్తారు. ఈ క్రమంలో స్టాక్ ఉన్నంత వరకు రూ.1కే ఆ ఇయర్ బడ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. తరువాత రూ.2199 ధర చెల్లించి వాటిని కొనాల్సి ఉంటుంది. అందువల్ల ఎంత త్వరగా వాటిని కొనుగోలు చేస్తే అంత త్వరగా ఆఫర్‌ను పొందవచ్చన్నమాట.
ఇక ప్రొబడ్స్ ఇయర్ బడ్స్‌ను బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందిస్తున్నారు. వీటికి సుపీరియర్ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. అందువల్ల ఇయర్‌బడ్స్ ప్రీమియం క్వాలిటీని కలిగి ఉంటాయి. వీటిల్లో 11.6 ఎంఎం అడ్వాన్స్‌డ్ డ్రైవర్స్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఒక్కో ఇయర్ బడ్‌లో 55 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంటుంది. దీంతోపాటు కేస్‌ను కూడా ఇస్తారు. కేస్‌తో అయితే 25 గంటల పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ వినవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…