హానర్ సంస్థ హానర్ బ్యాండ్ 6 పేరిట ఓ నూతన స్మార్ట్ బ్యాండ్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 1.47 ఇంచుల అమోలెడ్ టచ్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది. హార్ట్ రేట్‌ను ట్రాక్ చేయవచ్చు. 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్ లభిస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్‌ను కూడా తెలుసుకోవచ్చు.
ఈ ఫిట్ నెస్ బ్యాండ్‌లో 10 రకాల వర్కవుట్ మోడ్స్‌ను అందిస్తున్నారు. ఔట్ డోర్, ఇండోర్ వర్కవుట్ మోడ్స్‌కు సపోర్ట్ లభిస్తుంది. ఈ బ్యాండ్ 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ను ఇస్తున్నారు.
హానర్ బ్యాండ్ 6 ఫీచర్లు
- 1.47 ఇంచ్ అమోలెడ్ టచ్ డిస్‌ప్లే, 194×368 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- బ్లూటూత్ 5.0, ఆండ్రాయిడ్ కనెక్టివిటీ, వాటర్ రెసిస్టెన్స్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్
- స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్
- 10 వర్కవుట్ మోడ్స్, 180 ఎంఏహెచ్ బ్యాటరీ, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జింగ్
హానర్ బ్యాండ్ 6 మీటియోరైట్ బ్లాక్, శాండ్ స్టోన్ గ్రే, కోరల్ పింక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ బ్యాండ్ ధర రూ.3,999 ఉండగా దీన్ని జూన్ 14 నుంచి విక్రయించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.