కరోనా నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. గత ఏడాదిన్నర కాలంగా ఈ మహమ్మారి ఎప్పుడు అంతం అవుతుందా ? అని ఎదురు చూస్తున్నారు. మరో వైపు కోవిడ్ రాకుండా అనేక జాగ్రత్తలను పాటిస్తున్నారు. అయితే కింద తెలిపిన డిజిటల్ పరికరాలను ఇంట్లో ఉంచుకుంటే దాంతో కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. మరి ఆ పరికరాలు ఏమిటంటే..
దీని సహాయంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీని ద్వారా రోజూ పరీక్ష చేసుకోవాలి. కోవిడ్ లక్షణాలు లేకున్నా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే వెంటనే అలర్ట్ అయి చికిత్స తీసుకోవచ్చు. అందుకని ఈ మీటర్‌ను కచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి.
ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ ఎమర్జెన్సీ సమయాల్లో మనకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఈ-కామర్స్ సైట్లలోనూ లభిస్తుంది. కనుక కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండాలంటే దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలి.
దీని సహాయంతో వ్యక్తులను టచ్ చేయకుండానే 2 లేదా 3 ఇంచుల దూరం నుంచే వ్యక్తి ఉష్ణోగ్రతను కొలవచ్చు. జ్వరం ఉందీ, లేనిదీ సులభంగా తెలుస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండవచ్చు. కనుక దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవడం ఉత్తమం.
పల్స్, బీపీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. కనుక ఈ మీటర్‌ను కూడా ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం.
దీని వల్ల ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ ను చెక్ చేసుకోవచ్చు. కోవిడ్ సమయంలో ఇది ఎంతగానో పనిచేస్తుంది. అసాధారణ రీతిలో షుగర్ లెవల్స్ ఉంటే వెంటనే తెలిసిపోతుంది. జాగ్రత్త పడవచ్చు. దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలి.
ఈ పరికరాలన్నింటినీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా కోవిడ్ సమయంలో మనం మన ఆరోగ్యాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…