కరోనా నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకే పరిమితం అయ్యారు. కోవిడ్ రెండో ప్రభావం తగ్గుముఖం పడుతున్నా క్లాసులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో ఆన్‌లైన్ క్లాసులతోనే నెట్టుకొస్తున్నారు. అయితే ఇంట్లో ఉండి ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు లేదా కంప్యూటర్లు కావల్సి వస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ధర కూడా తక్కువే. మరి ఆ ఫోన్లు ఏమిటంటే..
1. శాంసంగ్ కు చెందిన గెలాక్సీ ఎఫ్12 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999గా ఉంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 48, 5, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆన్‌లైన్ క్లాసులకు పర్ ఫెక్ట్ గా సూటవుతుందని చెప్పవచ్చు.
2. రియల్‌మికి చెందిన నార్జో 30ఎ ఫోన్ ధర రూ.8,249గా ఉంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి.
3. శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎం12 ఫోన్ ధర రూ.10,999గా ఉంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
4. రెడ్‌మీ 9ఎ స్మార్ట్ ఫోన్ ధర రూ.7,499గా ఉంది. ఇందులో 6.53 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.
5. రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,499గా ఉంది. ఇందులో 6.53 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 13, 8, 2, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5020 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి.
ఇవే కాకుండా రియల్‌మికి చెందిన సి25 (ధర రూ.9,499), పోకో సి3 (రూ.9,999), ఒప్పో ఎ15 (రూ.9,990), రెడ్‌మీ 9 (రూ.8,999), రియల్‌మి సి20 (రూ.6,799) ఫోన్లు కూడా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులకు ఎంతగానో ఉపయోగపడతాయి. పైగా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి.