చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 3వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ వెనుక బడింది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. పలువురు బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించే యత్నం చేసినా విఫలం అయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌పై కోల్‌కతా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా కోల్‌కతా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠిలు రాణించారు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో రాణా 80 పరుగులు చేయగా, 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో త్రిపాఠి 53 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మనీష్ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. షకిబ్ అల్ హసన్, ప్యాట్ కమ్మిన్స్, ఆండ్రు రస్సెల్‌లు తలా 1 వికెట్ తీశారు.