ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 23వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని చెన్నై అలవోకగా సాధించింది. చెన్నై బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. దీంతో హైదరాబాద్‌పై చెన్నై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో మనీష్ పాండే, డేవిడ్ వార్నర్‌లు రాణించారు. 46 బంతుల్లో పాండే 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 61 పరుగులు చేయగా, 55 బంతుల్లో వార్నర్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 2 వికెట్లు తీయగా, శామ్ కుర్రాన్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 12 ఫోర్లతో 75 పరుగులు చేయగా, డుప్లెసిస్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు.