ఐపీఎల్ 2021 ఎడిషన్ కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మొదటి దశలో 29 మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ క్రమంలోనే మరో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ 19 నుంచి ఆ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. అక్టోబర్ 15వ తేదీన ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లన్నింటినీ యూఏఈలోనే నిర్వహిస్తారు. ఈ మేరకు ఆదివారం బీసీసీఐ వివరాలను వెల్లడించింది.
సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 10, 11, 13 తేదీల్లో క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైర్ మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 15న ఫైనల్ జరుగుతుంది. మొత్తం మ్యాచ్‌లలో 13 మ్యాచ్‌లు దుబాయ్‌లో, 10 షార్జాలో, 8 అబుధాబిలో జరుగుతాయి.
https://twitter.com/BoriaMajumdar/status/1419291938793037830
కాగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలు టాప్ 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ షెడ్యూల్‌లో విదేశీ ప్లేయర్లు చాలా మంది పాల్గొనడం లేదు. ఐపీఎల్ రెండో షెడ్యూల్‌కు కొద్ది రోజుల తరువాతే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో చాలా జట్లు తమ ప్లేయర్లను ఐపీఎల్‌లో ఆడించేందుకు నిరాకరించాయి. దీంతో చాలా మంది విదేశీ ప్లేయర్లు ఈ షెడ్యూల్‌లో కనిపించరు.