ప్ర‌త్యేక ఆస‌క్తి

Natural AC : స‌హ‌జ‌సిద్ధ‌మైన ఏసీ.. రూ.500 చాలు.. ఇల్లు మొత్తం కూల్ అవుతుంది.. క‌రెంటు అవ‌స‌రం లేదు..!

Natural AC : వేస‌వి కాలంలో మే నెల వ‌చ్చిందంటే చాలు.. అంద‌రూ హ‌డ‌లెత్తిపోతుంటారు. మండే ఎండ‌ల‌తో అల్లాడిపోతుంటారు. వేస‌వి తాపం నుంచి వేడి నుంచి బ‌య‌ట ప‌డేందుకు అనేక ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కూల‌ర్లు, ఏసీల వాడ‌కం ఈ సీజ‌న్‌లో పెరిగిపోతుంది. అలాగే చ‌ల్ల‌ని పానీయాల‌ను సైతం సేవిస్తుంటారు. వేడి నుంచి బ‌య‌ట ప‌డేందుకు అంద‌రూ ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. అయితే చాలా త‌క్కువ ఖ‌ర్చులోనే ఇంటిని చ‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అందుకు క‌రెంటు, ఏసీ అవ‌స‌రం లేదు. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్కెట్‌లో మ‌న‌కు బ‌య‌ట కూల్ పెయింట్ లేదా వైట్ పెయింట్ అని ల‌భిస్తుంటాయి. వీటిని తెచ్చి ఇంటి పైక‌ప్పు మీద రెండు నుంచి మూడు కోట్‌లు వేయాలి. ఈ పెయింట్ ఎండ వేడిని త‌గ్గించ‌డంలో చాలా బాగా ప‌నిచేస్తుంది. అయితే కొంద‌రు ఈ పెయింట్‌ను ఒక‌సారి వేసి త‌రువాత ప్ర‌తి ఏడాది అలాగే ఉంచుతారు. కానీ ప్ర‌తి సారి మ‌ళ్లీ కోట్‌లు వేస్తుండాలి. దీంతో పెయింట్ బాగా ప‌నిచేస్తుంది. ఇక ఈ పెయింట్‌ను వేయ‌డం వ‌ల్ల బ‌య‌ట క‌న్నా లోప‌ల సుమారుగా 10 డిగ్రీల మేర ఉష్ణోగ్ర‌త త‌గ్గుతుంది. సాధార‌ణంగా మ‌న‌కు బ‌య‌ట 40 డిగ్రీల‌కు పైనే వేడి ఉంటుంది.

Natural AC

ఇంట్లో 35 నుంచి 37 డిగ్రీల వ‌ర‌కు వేడి ఉంటుంది. కానీ కూల్ పెయింట్ ను వేస్తే 30 డిగ్రీల వ‌ర‌కు ఇంట్లో ఉష్ణోగ్ర‌త త‌గ్గుతుంది. దీంతో చాలా వ‌ర‌కు వేడి త‌గ్గిపోతుంది. ఇక ఇంటిని చ‌ల్ల‌ని ఏసీలా మార్చుకునే మ‌రో ట్రిక్‌.. వట్టివేరుతో త‌యారు చేసిన చాప‌లు అని చెప్ప‌వ‌చ్చు. ఇవి మ‌న‌కు మార్కెట్ లో చాలా త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి. వీటిని కొని తెచ్చి మ‌న ఇంటి ద్వారాలు, కిటికీల‌కు బ‌య‌టి వైపు వేళ్లాడ‌దీయాలి. అవి పూర్తిగా క‌వ‌ర్ అయ్యి ఉండేలా చాప‌ల‌ను వాటికి క‌ట్టాలి. ఇక వీటిని నీళ్ల‌తో త‌డ‌పాలి. ఒక‌సారి నీళ్ల‌తో త‌డిపితే చాలా వ‌ర‌కు త‌డి అలాగే ఉంటుంది. అంత త్వ‌ర‌గా ఎండిపోదు. క‌నుక ఆ చాప నుంచి వ‌చ్చే గాలి మ‌న‌కు లోప‌లికి చ‌ల్ల‌గా వ‌స్తుంది. దీంతో బ‌య‌టి నుంచి వ‌చ్చే వ‌డ‌గాలుల‌ను ఇంటి లోప‌లికి రాకుండా అడ్డుకోవ‌చ్చు.

ఇక వ‌ట్టివేరు స‌హ‌జంగానే సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక దాంతో త‌యారు చేసిన చాప‌ల‌ను బ‌య‌ట వేళ్లాడ‌దీస్తే అప్పుడు ఆ చాప‌ల నుంచి లోప‌లికి వ‌చ్చే గాలి ఎంతో సువాస‌న‌భ‌రితంగా ఉంటుంది. దీంతో మ‌న‌కు ఓ వైపు చ‌ల్ల‌ని గాలి ల‌భిస్తుంది. రెండోది.. అది సువాస‌న‌భ‌రితంగా కూడా ఉంటుంది. ఇలా ఈ చాప‌ల‌తో మ‌నం రెండు ర‌కాలుగా లాభం పొంద‌వ‌చ్చు. ఇలా ఈ రెండు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల క‌రెంటు, ఏసీల అవ‌స‌రం లేకుండానే ఇల్లంతా చ‌ల్ల‌గా మారిపోతుంది. దీంతో వేసవి మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా గ‌డిచిపోతుంది. వేస‌వి తాపం, వేడి ఉండ‌వు. శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM