Natural AC : వేసవి కాలంలో మే నెల వచ్చిందంటే చాలు.. అందరూ హడలెత్తిపోతుంటారు. మండే ఎండలతో అల్లాడిపోతుంటారు. వేసవి తాపం నుంచి వేడి నుంచి బయట పడేందుకు అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. ఈ క్రమంలోనే కూలర్లు, ఏసీల వాడకం ఈ సీజన్‌లో పెరిగిపోతుంది. అలాగే చల్లని పానీయాలను సైతం సేవిస్తుంటారు. వేడి నుంచి బయట పడేందుకు అందరూ రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. అయితే చాలా తక్కువ ఖర్చులోనే ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. అందుకు కరెంటు, ఏసీ అవసరం లేదు. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్‌లో మనకు బయట కూల్ పెయింట్ లేదా వైట్ పెయింట్ అని లభిస్తుంటాయి. వీటిని తెచ్చి ఇంటి పైకప్పు మీద రెండు నుంచి మూడు కోట్‌లు వేయాలి. ఈ పెయింట్ ఎండ వేడిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అయితే కొందరు ఈ పెయింట్‌ను ఒకసారి వేసి తరువాత ప్రతి ఏడాది అలాగే ఉంచుతారు. కానీ ప్రతి సారి మళ్లీ కోట్‌లు వేస్తుండాలి. దీంతో పెయింట్ బాగా పనిచేస్తుంది. ఇక ఈ పెయింట్‌ను వేయడం వల్ల బయట కన్నా లోపల సుమారుగా 10 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గుతుంది. సాధారణంగా మనకు బయట 40 డిగ్రీలకు పైనే వేడి ఉంటుంది.
ఇంట్లో 35 నుంచి 37 డిగ్రీల వరకు వేడి ఉంటుంది. కానీ కూల్ పెయింట్ ను వేస్తే 30 డిగ్రీల వరకు ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో చాలా వరకు వేడి తగ్గిపోతుంది. ఇక ఇంటిని చల్లని ఏసీలా మార్చుకునే మరో ట్రిక్.. వట్టివేరుతో తయారు చేసిన చాపలు అని చెప్పవచ్చు. ఇవి మనకు మార్కెట్ లో చాలా తక్కువ ధరకు లభిస్తాయి. వీటిని కొని తెచ్చి మన ఇంటి ద్వారాలు, కిటికీలకు బయటి వైపు వేళ్లాడదీయాలి. అవి పూర్తిగా కవర్ అయ్యి ఉండేలా చాపలను వాటికి కట్టాలి. ఇక వీటిని నీళ్లతో తడపాలి. ఒకసారి నీళ్లతో తడిపితే చాలా వరకు తడి అలాగే ఉంటుంది. అంత త్వరగా ఎండిపోదు. కనుక ఆ చాప నుంచి వచ్చే గాలి మనకు లోపలికి చల్లగా వస్తుంది. దీంతో బయటి నుంచి వచ్చే వడగాలులను ఇంటి లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు.
ఇక వట్టివేరు సహజంగానే సువాసనను కలిగి ఉంటుంది. కనుక దాంతో తయారు చేసిన చాపలను బయట వేళ్లాడదీస్తే అప్పుడు ఆ చాపల నుంచి లోపలికి వచ్చే గాలి ఎంతో సువాసనభరితంగా ఉంటుంది. దీంతో మనకు ఓ వైపు చల్లని గాలి లభిస్తుంది. రెండోది.. అది సువాసనభరితంగా కూడా ఉంటుంది. ఇలా ఈ చాపలతో మనం రెండు రకాలుగా లాభం పొందవచ్చు. ఇలా ఈ రెండు చిట్కాలను పాటించడం వల్ల కరెంటు, ఏసీల అవసరం లేకుండానే ఇల్లంతా చల్లగా మారిపోతుంది. దీంతో వేసవి మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా గడిచిపోతుంది. వేసవి తాపం, వేడి ఉండవు. శరీరం చల్లగా ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.