Facts About Rice : మనం రోజూ బియ్యంతో వండిన అన్నం తింటుంటాం. దక్షిణ భారతీయులకు అన్నమే ప్రధాన ఆహారం. అయితే మనకు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50 శాతం మంది జనాభాకు బియ్యమే ప్రధాన ఆహారం. ఆసియా దేశాల్లో అగ్రభాగం బియ్యానిదే. చాలా మంది అన్నాన్ని ఆహారంగా తింటారు. ఈ క్రమంలోనే బియ్యానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యాన్ని మనుషులు ఎంతో పురాతన కాలం నుంచే పండిస్తున్నారు. సుమారుగా 9వేల ఏళ్ల కిందటి నుంచే వరిని సాగు చేస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. బియ్యానికి అంతటి చరిత్ర ఉందన్నమాట.
మనకు తెలిసిన బియ్యం రకాలు కొన్నే. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్‌తోపాటు దొడ్డు బియ్యం, సన్న బియ్యం అని పలు రకాలు మనకు తెలుసు. కానీ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1,20,000 రైస్ వెరైటీలు ఉన్నాయట. చాలా మంది తెల్ల అన్నం తింటారు. కానీ అన్నింటికన్నా ముడి బియ్యం.. బ్రౌన్ రైస్ చాలా ఆరోగ్యకరమైనది. దీన్ని తింటే బరువు తగ్గడంతోపాటు గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. బియ్యాన్ని అనేక సౌందర్య సాధన ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు. అందువల్ల బియ్యాన్ని మనం జుట్టు లేదా చర్మానికి కూడా ఉపయోగించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారుగా 500 మిలియన్ల టన్నులకు పైగా వరిని పండిస్తున్నారు. మొక్కజొన్న తరువాత ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా సాగు చేయబడుతున్న పంటగా వరి రెండో స్థానంలో నిలుస్తుంది. ఇక జపాన్ వారు బియ్యాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. వారు తమ శుభ కార్యాల్లో తప్పనిసరిగా బియ్యంతో చేసిన వంటకాలను పెడతారు. అలాగే థాయ్‌లాండ్ వాసులు సన్యాసులకు బియ్యాన్ని భిక్షగా వేస్తారు. దీంతో వారికి ఎంతో మంచి జరుగుతుందని భావిస్తారు.
వరి పంటను సాధారణంగా ఏడాదికి రెండు సార్లు పండిస్తారు. కానీ కొన్ని చోట్లు మూడు పంటలు వేస్తారు. ఇక అన్నింటి కన్నా బాస్మతి రైస్‌లో పోషకాలు ఎక్కువట. కానీ ఫైబర్ కావాలంటే మాత్రం బ్రౌన్ రైస్‌ను తినాలి. ఇక బ్రౌన్ రైస్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకోవడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల బ్రౌన్ రైస్‌ను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…