రైలు ప్రయాణం అంటే దాదాపుగా ఎవరికైనా సరే అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తే చాలా మందికి వాంతులు అవుతాయి. కానీ రైలు ప్రయాణం అలా కాదు. చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే రైళ్లలో ప్రయాణించేటప్పుడు సహజంగానే రైలు బోగీలపై, రైల్వే స్టేషన్లలో బోర్డులపై పలు ప్రత్యేక అంకెలు, అక్షరాలు, చిహ్నాలను చూస్తుంటాం. ఈ క్రమంలోనే రైలు చివరి బోగీ వెనుక భాగంలో ఆంగ్ల అక్షరం X అనే సింబల్‌ను వేస్తారు. అయితే దీన్ని ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
రైలు చివరి భాగంలో ఉండే బోగీ వెనుక పసుపు లేదా తెలుపు రంగులో ఆంగ్ల అక్షరం X ను పోలిన సింబల్ ఉంటుంది. అలాగే ఆ సింబల్ దగ్గరగా LV అనే అక్షరాలు కూడా ఉంటాయి. LV అంటే లాస్ట్ వెహికిల్ అని అర్థం. ఇక బోగీ వెనుక భాగంలో ఒక చిన్న ఎల్లో కలర్ బోర్డు కూడా ఉంటుంది. ఇది రెండు వైపులా ఉంటుంది. దీంతోపాటు X అనే సింబల్ కింది భాగంలో ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది.
బోగి వెనుక భాగంలో X అనే సింబల్ ఉందంటే అది ఆ రైలుకు చెందిన చివరి బోగీ అని అర్థం. దీంతో ప్రమాదాలు కాకుండా జాగ్రత్త పడవచ్చు. రైలు చివరి బోగీ వెనుక భాగంలో X అనే సింబల్ లేకపోతే కొన్ని బోగీలు విడిపోయాయని అర్థం. దీంతో వెంటనే సిబ్బంది అలర్ట్ అయి ప్రమాదాలు జరగకుండా చూస్తారు. ఇక రైల్వే స్టేషన్‌లో ఉండే గార్డు ప్లాట్ ఫాంపై రైలు చివరి బోగీ వెనుక భాగంలో ఉండే X సింబల్ ను చూస్తాడు. దీంతో అన్ని బోగీలు కనెక్ట్ అయి ఉన్నాయని నిర్దారించి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. దీంతో రైలు కదులుతుంది.
ఇక రాత్రి పూట X సింబల్ కింద ఉండే రెడ్ లైట్ చివరి బోగీని నిర్దారించేందుకు ఉపయోగపడుతుంది. రాత్రి పూట ఆ లైట్ వెలగకపోయినా, బోగీపై X సింబల్ ప్రకాశిస్తూ కనిపించకపోయినా సిబ్బంది అలర్ట్ అవుతారు. రైలు ప్రమాదానికి గురి కాకుండా చూస్తారు. ఇలా X సింబల్ ఉపయోగపడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…