మనం నిత్యం వార్తా పత్రికలు, వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, టీవీలు.. ఇలా ఎక్కడ చూసినా మనకు ఎన్నో రకాల యాడ్స్ కనిపిస్తుంటాయి. అనేక కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు లేదా ఉత్పత్తులను, సేవలను అందించేందుకు అలా యాడ్స్ ఇస్తుంటాయి. వాటిల్లో భిన్న రకాల యాడ్స్ ఉంటాయి. అయితే దాదాపుగా అన్ని రకాల వస్తువులకు చెందిన యాడ్స్ ను మనం చూస్తుంటాం. కానీ మద్యం, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి యాడ్స్ మనకు ఎక్కడా కనిపించవు. అవును కదా.. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
1995లో అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ రీసెర్చ్ చేయించింది. దాని ప్రకారం, పొగాకు, మద్యం ఉత్పత్తలకు చెందిన యాడ్స్ ను ఇవ్వడం వల్ల వాటికి ప్రజలకు బాగా బానిసలవుతున్నారని, పొగ ఎక్కువగా తాగుతున్నారని, మద్యం ఎక్కువగా సేవిస్తున్నారని.. దీని వల్ల చాలా మంది ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని వెల్లడైంది. అందుకని అప్పటి నుంచి ఆ రెండు ఉత్పత్తులకు చెందిన యాడ్స్ ను ఎక్కడా ప్రసారం గానీ, ప్రింట్ గానీ చేయకుండా నిషేధించారు. అందుకనే మనకు దేశంలో ఎక్కడ చూసినా మద్యం, పొగాకు ఉత్పత్తులకు చెందిన యాడ్స్ కనిపించవు.
అయితే మద్యం కంపెనీలు ఊరుకోలేదు. తమ బ్రాండ్ల ఉత్పత్తులను భిన్నంగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించాయి. అవి మ్యూజిక్ సీడీలు, క్యాసెట్లు, మినరల్ వాటర్, సోడాల పేరిట ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించాయి. కానీ వాటికి మద్యం బ్రాండ్ల పేర్లే ఉంటాయి. ఈ క్రమంలో వాటికి యాడ్స్‌ను ఇస్తున్నారు. సహజంగానే మద్యం ప్రియులు ఆ యాడ్స్‌ను చూస్తే సదరు ఉత్పత్తులు గుర్తుకు రావు. మద్యమే గుర్తుకు వస్తుంది. దీంతో పబ్లిసిటీ అయిపోతుంది. అందుకనే మద్యం కంపెనీలు పైన చెప్పిన విధంగా ఉత్పత్తులను తయారు చేస్తూ పరోక్షంగా తమ మద్యం బ్రాండ్లకు ప్రచారం కల్పిస్తున్నాయి. ఇదీ.. అసలు విషయం.
అయితే దీని వెనుక బ్రిటన్ తీసుకున్న నిర్ణయమే కారణమని చెప్పవచ్చు. అప్పట్లో బ్రిటన్‌లోనూ మద్యం, పొగాకు ఉత్పత్తులకు చెందిన యాడ్స్ ను ఇచ్చేవారు. కానీ అక్కడ ప్రజలు విపరీతంగా మద్యం సేవిస్తున్నారని భావించిన బ్రిటన్ ఆయా ఉత్పత్తులకు యాడ్స్ ఇవ్వకుండా నిషేధించింది. తరువాత మన దేశంలోనూ సరిగ్గా ఇలాగే నిషేధం అమలులోకి వచ్చింది. అందుకని అప్పటి నుంచి పొగాకు, మద్యం ఉత్పత్తులకు చెందిన యాడ్స్ మనకు కనిపించడం లేదు. ఇదీ.. దీని వెనుక ఉన్న అసలు కారణం. అయినప్పటికీ పరోక్షంగా మద్యం కంపెనీలు పైన చెప్పిన విధంగా తమ బ్రాండ్లకు ప్రచారం కల్పిస్తూనే ఉన్నాయి.. ఇలా ఇప్పటికీ జరుగుతూనే ఉంది..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…